Modi varanasi visit: ఉత్తర్ప్రదేశ్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం సహా వివిధ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయితే.. సోమవారం అర్ధరాత్రి కూడా ఆయన బిజీగానే గడిపారు. బనారస్(వారణాసి) రైల్వే స్టేషన్ను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్తో కలిసి సందర్శించారు. నగరంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
Modi in banaras station: "రైళ్ల కనెక్టివిటీని మెరుగుపరచడం సహా పరిశుభ్రత, ఆధునికత, ప్రయాణికులకు స్నేహపూర్వక రైల్వే స్టేషన్ల ఏర్పాటులో తమ ప్రభుత్వం కృషి చేస్తోంది" అని బనారస్ రైల్వే స్టేషన్ సందర్శన అనంతరం మంగళవారం ఉదయం 1:23 గంటలకు మోదీ ట్వీట్ చేశారు.
Modi inspections in varanasi: అంతకుముందు.. వారణాసిలో కీలక అభివృద్ధి పనులను యోగి ఆదిత్యానాథ్తో కలిసి మోదీ పరిశీలించారు. స్థానికులతో ఆయన ముచ్చటించారు. "ఆధ్యాత్మిక నగరంలో సాధ్యమైనంత మేర ఉత్తమమైన మౌలిక వసతులు కల్పించేందుకు తాము ప్రయత్నిస్తాం" అని ట్విట్టర్ వేదికగా మోదీ పేర్కొన్నారు.
సోమవారం భాజపా ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతోనూ మోదీ సమావేశమయ్యారు.
ఇవీ చూడండి: