ETV Bharat / bharat

'ఆర్​ఈ-ఇన్వెస్ట్ 2020'ను ప్రారంభించనున్న మోదీ - గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్​రత్

'ఆర్​ఈ-ఇన్వెస్ట్ 2020' పేరుతో పునరుత్పాదక ఇంధన పెట్టుబడులపై గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగే వర్చువల్ సమావేశాన్ని ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Re-invest 2020
'రీ-ఇన్వెస్ట్ 2020' సమావేశాన్ని ప్రారంభించనున్న మోదీ
author img

By

Published : Nov 26, 2020, 5:04 AM IST

ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడులపై వర్చువల్​గా నిర్వహిస్తోన్న మూడో సదస్సును ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 'ఆర్​ఈ-ఇన్వెస్ట్ 2020' ​పేరుతో నవంబర్ 26 నుంచి 28 వరకు ఈ సమావేశాన్ని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.

వర్చువల్​గా జరిగే ఈ సమావేశానికి 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 1000 మంది వ్యాపారవేత్తలు, 50,000 మంది వరకు అధికారులు హాజరవుతారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పునరుత్పాదక ఇంధనంపై నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులపై ప్రధానంగా చర్చించనున్నారని పేర్కొంది.

స్పీకర్ల సదస్సు ముగింపులో...

గుజరాత్​లోని కేవాడియాలో జరుగుతోన్న 80వ అఖిల భారత స్పీకర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. బుధవారం ప్రారంభమయిన ఈ కార్యక్రమం నేటితో ముగియనుంది

ఇదీ చదవండి:'ఆత్మపరిశీలనకూ సమయం కేటాయించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.