Modi Surname Case In Supreme Court : మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్‌ను సూరత్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చడంపై స్టే విధించింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని కోర్టు అభిప్రాయపడింది. ప్రజా జీవితంలో ఉన్న వారు బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పరువు నష్టం కేసులో గరిష్ఠ శిక్ష అయిన రెండేళ్ల జైలు శిక్షను రాహుల్‌కు ఎందుకు విధించారో సూరత్ కోర్టు సరైన కారణాలు చూపలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
'అవిశ్వాసంపై రాహుల్ మాట్లాడాలి.. అనర్హత రద్దు చేయండి'
అనర్హత కేసులో రాహుల్‌గాంధీకి సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించడం ద్వారా సత్యం గెలిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదురి అన్నారు. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరినట్లు తెలిపారు. అనర్హత రద్దును ఆలస్యం చేస్తే.. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని.. ఆలస్యం చేయవద్దని స్పీకర్‌ను కోరినట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.
సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం స్పందించిన రాహుల్ గాంధీ.. ఏది ఏమైనా తన కర్తవ్యాన్ని విడిచిపెట్టనని వ్యాఖ్యానించారు. భారత్ అనే భావనను పరిరక్షించడమే తన ధ్యేయమని ట్వీట్ చేశారు.
-
#WATCH | Delhi: Celebration at the AICC Office after Supreme Court stays the conviction of Congress leader Rahul Gandhi in 'Modi Surname' defamation case pic.twitter.com/HJuvsLkIb2
— ANI (@ANI) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Delhi: Celebration at the AICC Office after Supreme Court stays the conviction of Congress leader Rahul Gandhi in 'Modi Surname' defamation case pic.twitter.com/HJuvsLkIb2
— ANI (@ANI) August 4, 2023#WATCH | Delhi: Celebration at the AICC Office after Supreme Court stays the conviction of Congress leader Rahul Gandhi in 'Modi Surname' defamation case pic.twitter.com/HJuvsLkIb2
— ANI (@ANI) August 4, 2023
ఇది విద్వేషంపై విజయం : కాంగ్రెస్
రాహుల్‌గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించటం పట్ల.. కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యలయం వద్దకు కాంగ్రెస్ అభిమానులు చేరుకుని.. రాహుల్ ఫొటో మాస్కులు ధరించి ఉత్సాహంగా నినాదాలు చేశారు.
'ఇది విద్వేషంపై గెలుపు. సత్యమేమ జయతే' అని కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు సత్యాన్ని బలపరిచిందని కాంగ్రెస్ పేర్కొంది. ద్వేషంపై ప్రేమ సాధించిన విజయంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అభివర్ణించింది. భారతీయ జనతా పార్టీ అవిశ్రాంతంగా శ్రమించినప్పటికీ.. రాహుల్‌గాంధీ లొంగకుండా న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. ట్వీట్ చేశారు.
"ఈ తీర్పు బీజేపీ, ఆ పార్టీ నాయకులకు గుణపాఠం కావాలి. అధికార పార్టీ ఎంత దారుణంగా ప్రవర్తించినా.. మేము మాత్రం తగ్గేదేలే. మేము కేంద్ర ప్రభుత్వం, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. రాజ్యాంగ విలువలను కాపాడతాం. నిరాశతో ప్రభుత్వం ధ్వంసం చేయాలని భావిస్తున్న సంస్థలపై విశ్వాసం కొనసాగిస్తాము. సత్యమేవ జయతే."
--జైరాం రమేశ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
న్యాయం గెలిచింది : కేసీ వేణుగోపాల్
సుప్రీం కోర్టు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. 'రాహుల్ గాంధీ శిక్షపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. న్యాయం గెలిచింది. ప్రజావాణిని ఏ శక్తి కూడా ఆపలేదు' అని ట్వీట్ శారు. సుప్రీం తీర్పును ప్రశంసించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా.. న్యాయం గెలిచిందన్నారు. ప్రజాస్వామ్య మందిరాల్లో సత్యం గర్జన వినబడుతోందని చెప్పారు.
-
#WATCH | "The judgement of the Supreme Court has once again re-established the faith of common people in SC, in democracy, constitutionalism and in the principle that truth shall prevail," Congress MP Randeep Surjewala after SC stays conviction of Rahul Gandhi in Modi surname… pic.twitter.com/Df674gaR5P
— ANI (@ANI) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "The judgement of the Supreme Court has once again re-established the faith of common people in SC, in democracy, constitutionalism and in the principle that truth shall prevail," Congress MP Randeep Surjewala after SC stays conviction of Rahul Gandhi in Modi surname… pic.twitter.com/Df674gaR5P
— ANI (@ANI) August 4, 2023#WATCH | "The judgement of the Supreme Court has once again re-established the faith of common people in SC, in democracy, constitutionalism and in the principle that truth shall prevail," Congress MP Randeep Surjewala after SC stays conviction of Rahul Gandhi in Modi surname… pic.twitter.com/Df674gaR5P
— ANI (@ANI) August 4, 2023
న్యాయ పోరాటం కొనసాగిస్తాం : పూర్ణేష్ మోదీ
సుప్రీం తీర్పుపై.. రాహుల్‌పై పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ స్పందించారు. 'ఈ రోజు, సుప్రీం కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై స్టే విధించింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పును మేము స్వాగతిస్తున్నాము. కోర్టులో మా న్యాయ పోరాటం కొనసాగిస్తాము" అని అన్నారు. రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు కొంత ఊరటనిచ్చిందని.. అయితే ఆయనను నిర్దోషిగా ప్రకటించలేదని బీజేపీ నేత సుబ్రత్ పాఠక్ అన్నారు.
-
#WATCH | "Today, SC has stayed Rahul Gandhi's conviction. We welcome this verdict given by the court. We will continue our legal battle in the court," BJP MLA Purnesh Modi, who filed a defamation case against Congress leader Rahul Gandhi. pic.twitter.com/Zf4NGYI1La
— ANI (@ANI) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "Today, SC has stayed Rahul Gandhi's conviction. We welcome this verdict given by the court. We will continue our legal battle in the court," BJP MLA Purnesh Modi, who filed a defamation case against Congress leader Rahul Gandhi. pic.twitter.com/Zf4NGYI1La
— ANI (@ANI) August 4, 2023#WATCH | "Today, SC has stayed Rahul Gandhi's conviction. We welcome this verdict given by the court. We will continue our legal battle in the court," BJP MLA Purnesh Modi, who filed a defamation case against Congress leader Rahul Gandhi. pic.twitter.com/Zf4NGYI1La
— ANI (@ANI) August 4, 2023
-
VIDEO | "The Supreme Court has given some relief to Rahul Gandhi, however, he has not been acquitted yet," says BJP leader @SubratPathak12 on Supreme Court staying the conviction of Rahul Gandhi in Modi surname remark case. pic.twitter.com/Azzy0hN7aX
— Press Trust of India (@PTI_News) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "The Supreme Court has given some relief to Rahul Gandhi, however, he has not been acquitted yet," says BJP leader @SubratPathak12 on Supreme Court staying the conviction of Rahul Gandhi in Modi surname remark case. pic.twitter.com/Azzy0hN7aX
— Press Trust of India (@PTI_News) August 4, 2023VIDEO | "The Supreme Court has given some relief to Rahul Gandhi, however, he has not been acquitted yet," says BJP leader @SubratPathak12 on Supreme Court staying the conviction of Rahul Gandhi in Modi surname remark case. pic.twitter.com/Azzy0hN7aX
— Press Trust of India (@PTI_News) August 4, 2023
ఇదీ పూర్తి కేసు..
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఈ పరువునష్టం కేసు నమోదైంది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గుజరాత్ ఎమ్మెల్యే పుర్ణేశ్ మోదీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్‌లోని ట్రయల్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. తాజాగా సుప్రీంకోర్టులో రాహుల్‌కు ఊరట లభించింది.