ETV Bharat / bharat

Modi Rojgar Mela : 'మహిళలకు బీజేపీ సర్కార్​ సరికొత్త ద్వారాలు.. అన్ని రంగాల్లోనూ ముందంజ' - మోదీ రోజ్​గార్​ మేళా 2023

Modi Rojgar Mela 2023 : భారతీయ మహిళలు అంతరిక్షం నుంచి క్రీడల వరకు అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని మహిళలకు తమ ప్రభుత్వం.. సరికొత్త ద్వారాలు తెరుస్తోందని చెప్పారు.

Modi Rojgar Mela
Modi Rojgar Mela
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 12:30 PM IST

Updated : Sep 26, 2023, 1:36 PM IST

Modi Rojgar Mela 2023 : దేశ మహిళలకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ద్వారాలు తెరుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పార్లమెంటు ఆమోదించిన మహిళా రిజర్వేషన్​ బిల్లు.. దేశానికి సరికొత్త భవిష్యత్‌ను అందిస్తుందని చెప్పారు. దేశంలోని 50 శాతం జనాభాకు ఈ బిల్లు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు రోజ్‌గార్ మేళా ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన 51 వేల మందికి.. ప్రధాని మోదీ వర్చువల్‌గా నియామక పత్రాలను అందజేశారు.

'అవినీతిని అరికట్టాం.. విశ్వసనీయతను పెంచాం'
Modi Speech Today : ప్రభుత్వ పాలనలో సాంకేతికత వినియోగం పెరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో సాంకేతికతను ఉపయోగించడం వల్ల అవినీతిని అరికట్టామని.. విశ్వసనీయతను పెంచామని తెలిపారు. నిశిత పరిశీలన, వేగంగా కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల్లో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసి.. 100 శాతం ప్రజలు సంతృప్తి చెందాలనే నూతన ధృక్పథంతో తాము పనిచేస్తున్నట్లు మోదీ వివరించారు.

  • #WATCH | "Several women recruits have got appointment letters today...'Aaj Bharat ki betiya space se spot tak anek keertimaan bana rahi hain'... Women have always brought change in several fields, with a new energy," says PM Modi addressing new appointees during 'Rozgar Mela' via… pic.twitter.com/2qL5nZ349C

    — ANI (@ANI) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రోజ్‌గార్ మేళాలో మన యువతులు కూడా ఎక్కువ సంఖ్యలో నియామక పత్రాలు అందుకున్నారు. నేడు భారతీయ మహిళలు అంతరిక్షం నుంచి క్రీడల వరకు అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. మన నారీమణుల విజయం అన్ని చోట్ల గౌరవాన్ని అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. నారీమణుల కోసం కొత్త ద్వారాలు మేము తెరుస్తున్నాం. మన మహిళలు సాయుధ బలగాల్లో కూడా చేరి భారత దేశానికి సేవ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో సాంకేతికతను ఉపయోగించడం వల్ల అవినీతిని అరికట్టాం. విశ్వసనీయతను పెంచాం"
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అండమాన్​ నికోబర్​ దీవుల్లో 1000 మందికి..
PM Rojgar Mela In September 2023 : మరోవైపు, అండమాన్​ నికోబర్​ దీవుల్లో రోజ్‌గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1000 మందికి నియమాక పత్రాలను అందజేశారు ప్రధాని మోదీ. అపాయింట్​మెంట్​ లెటర్​లను అందుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ ఉపాధి మేళా ద్వారా యువత.. గరిష్ఠ స్థాయిలో ప్రయోజనాలను పొందాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

'ఆ కంపెనీల్లో 40లక్షల ఉద్యోగాలు'.. 71వేల మందికి మోదీ అపాయింట్​మెంట్ లెటర్స్

PM Rojgar Mela : 'వృద్ధిబాటలో భారత ఆర్థిక వ్యవస్థ.. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు'

Last Updated : Sep 26, 2023, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.