అఫ్గానిస్థాన్‌లోని తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హాజరయ్యారు. అఫ్గాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని.
పంజ్‌షీర్ ఆక్రమణతో యావత్ అఫ్గాన్ తమ ఆధీనంలోకి వచ్చినట్లు తాలిబన్ల ప్రకటించటంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఉన్నత స్థాయి కమిటీ
అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు దేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న దానిపై ప్రధాని ఆరా తీసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అటు అఫ్గానిస్థాన్ విషయంలో తక్షణం భారత్ అనుసరించాల్సిన విధానాలపై దృష్టి పెట్టేందుకు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఇందులో విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, ఇతర సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: భారత్ అధ్యక్షతన గురువారం బ్రిక్స్ సదస్సు