ETV Bharat / bharat

'నడిరోడ్డుపై మోదీ'.. కుట్ర ప్రకారమే జరిగిందా? రైతుల మాటేంటి? - ప్రధాని నరేంద్ర మోదీ

Modi Punjab security breach: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై ఫిరోజ్​పుర్​లో కాన్వాయ్​ను అడ్డుకున్న రైతులు స్పందించారు. రోడ్డు ఖాళీ చేయించేందుకు ప్రధాని వస్తున్నారని పోలీసులు అబద్దం చెప్పి ఉంటారని భావించినట్లు వివరణ ఇచ్చారు. మరోవైపు, సానుభూతి కోసమే ఇలా చౌకబారు యత్నాలు చేస్తున్నారని రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. భద్రతా లోపానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని క్షమించలేమని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ అన్నారు.

MODI PUNJAB rally
'నడిరోడ్డుపై మోదీ'.
author img

By

Published : Jan 6, 2022, 6:36 PM IST

Updated : Jan 6, 2022, 10:23 PM IST

Modi Punjab security breach: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని వెళ్లిన రహదారిని దిగ్బంధించిన భారతీయ కిసాన్ యూనియన్(క్రాంతికారీ) నేత సుర్జీత్ సింగ్ ఫుల్.. ఈ ఘటనపై స్పందించారు. కాన్వాయ్​లో ప్రధాని ఉన్న విషయం తమకు తెలియదని చెప్పారు. రోడ్డు ఖాళీ చేయించేందుకు పోలీసులే.. ప్రధాని వచ్చారన్న భ్రమను కలిగించి ఉంటారని భావించినట్లు పేర్కొన్నారు.

Modi punjab rally Farmers reaction

"ఈ రోడ్డు మార్గాన ప్రధాని ప్రయాణిస్తారని మాకు ఫిరోజ్​పుర్ సీనియర్ ఎస్పీ సమాచారం అందించారు. ప్రధాని వస్తే గంట ముందే సమాచారం అందుతుందా? అని మేం ప్రశ్నించాం. మమ్మల్ని అక్కడి నుంచి పంపించేందుకే అలా చెబుతున్నారని అనుకున్నాం. హెలీప్యాడ్ సైతం ఏర్పాటు చేశారు కాబట్టి ప్రధాని వాయుమార్గంలో వస్తారని భావించాం. భాజపా కార్యకర్తలు మోదీ సభకు హాజరయ్యేలా చూసేందుకే పోలీసులు బుకాయిస్తున్నారని అనుకున్నాం."

-సుర్జీత్ సింగ్ ఫుల్, భారతీయ కిసాన్ యూనియన్(క్రాంతికారీ) అధ్యక్షుడు

Modi Punjab news

మోదీ వచ్చే మార్గంలో చాలా ట్రాఫిక్ ఉందని సుర్జీత్ తెలిపారు. ఒకవేళ నిజంగానే మోదీ రోడ్డుమార్గంలో వెళ్లాల్సి ఉంటే.. ఇరువైపులా ట్రాఫిక్​ను ముందుగానే ఆపాల్సిందని అన్నారు.

సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన...

ప్రధాని కాన్వాయ్ అటు నుంచి వెళ్తోందని తమకు స్పష్టమైన సమాచారమేమీ లేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్​కేఎం) పేర్కొంది. నిరసనకారులెవరూ కాన్వాయ్ వైపు వెళ్లలేదని స్పష్టం చేసింది. ప్రధాని ప్రాణాలకే ముప్పు అంటూ వచ్చిన ఆరోపణలు పూర్తిగా కల్పితాలని తెలిపింది.

"పంజాబ్​లో జనవరి 5, 10న ప్రధాని పర్యటిస్తారన్న వార్తలతో.. సంయుక్త కిసాన్ మోర్చా అనుబంధ సంఘాలు ప్రతీకాత్మక నిరసనలకు పిలుపునిచ్చాయి. కేంద్రమంత్రి అజయ్ మిశ్ర అరెస్టు సహా మిగిలిన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనకు దిగాయి. ఫిరోజ్​పుర్ జిల్లా కేంద్రానికి వెళ్లకుండా కొంతమంది రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చాలా చోట్ల రైతులు రోడ్లపైనే బైఠాయించారు. అందులో మోదీ కాన్వాయ్ వచ్చి ఆగిన ఫ్లై ఓవర్ సైతం ఉంది. ఆ మార్గం గుండా మోదీ కాన్వాయ్ వెళ్తున్నట్టు రైతులకు స్పష్టమైన సమాచారం లేదు. వీడియోలో ఉన్న దృశ్యాలను బట్టి రైతులెవరూ మోదీ కాన్వాయ్ వద్దకు వెళ్లలేదని స్పష్టంగా తెలుస్తోంది. భాజపా జెండాలు పట్టుకున్న కొంతమంది మాత్రమే 'మోదీ జిందాబాద్' అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ దగ్గరికి వెళ్లారు."

-సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాల సమితి

'అంతా సానుభూతి కోసమే'

మోదీ పర్యటనలో భద్రతా లోపాలు ఏమైనా ఉంటే.. దర్యాప్తు జరపాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ డిమాండ్ చేశారు. 'భాజపా వర్గాలేమో భద్రతా లోపాలు అని చెబుతున్నాయి. సభకు జనం రాలేదని ముఖ్యమంత్రి చన్నీ చెబుతున్నారు. మరి భద్రతా లోపాల వల్ల సభ ఆగిపోయిందా లేదా అన్నదాతల ఆగ్రహం వల్ల ఆగిపోయిందా అనే విషయంపై దర్యాప్తు జరపాలి' అని ట్వీట్ చేశారు. ఇదే విషయంపై మీడియాతో మాట్లాడిన టికాయిత్.. ప్రజల సానుభూతి కోసం మోదీ చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 'పంజాబ్ పర్యటన కోసం ప్రధాని ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు? ప్రాణాలతో బయటపడ్డానంటూ మోదీ వ్యాఖ్యానించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి ఇదంతా ఓ డ్రామా అని అర్థమవుతోంది. సానుభూతి కోసం చేస్తున్న చౌకబారు ప్రయత్నం ఇది' అని ఎద్దేవా చేశారు రాకేశ్ టికాయిత్.

'రైతులది.. ఏడాది కష్టం'

Modi Ferozepur rally Navjot Singh Sidhu: ఈ వ్యవహారంపై స్పందించిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ప్రధాని లక్ష్యంగా చురకలు అంటించారు. ఏడాది పాటు దిల్లీ సరిహద్దులో రైతులు బైఠాయించారని.. కేవలం 15 నిమిషాలకే మోదీ ఇబ్బంది పడ్డారని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసిన మోదీ.. ఉన్న ఆదాయాన్నీ లాగేసుకున్నారని ఆరోపించారు.

'అలా అనాల్సింది కాదు'

ఈ వ్యవహారంపై రాజకీయం జరగడం దురదృష్టకరమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. ప్రధాని భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అయితే, 'బతికి బయటపడ్డా'నంటూ మోదీ అనాల్సింది కాదని గహ్లోత్ వ్యాఖ్యానించారు. ప్రధాని భద్రతను చూసుకునే ఎస్​పీజీ, ఐబీని ఈ వ్యవహారంలో బాధ్యుల్ని చేయాలని డిమాండ్ చేశారు.

రాజ్​నాథ్ ఫైర్!

Rajnath Singh on PM Punjab rally: మరోవైపు, ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్.. పంజాబ్​లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భద్రతా లోపానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని క్షమించలేమని అన్నారు. ఉత్తరకాశీలో భాజపా నిర్వహించిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"పంజాబ్​లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధాని కాన్వాయ్​ విషయంలో భద్రతా లోపాలను ఊహించగలమా? ప్రధాని దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్, మన్మోహన్, దేవెగౌడ.. ఇలా ప్రధాని హోదాలో పనిచేసిన ఏ వ్యక్తిపైనా నేను నిరాధార ఆరోపణలు చేయలేదు. ఎందుకంటే.. ప్రధాని కార్యాలయం ఓ ప్రజాస్వామ్య సంస్థ. దాన్ని అందరూ గౌరవించాలి. ప్రధాని హోదాలోని వ్యక్తి భద్రతను సరిగా నిర్వహించలేకపోతే.. దేశ ప్రజాస్వామ్య సంస్థల విచ్ఛిన్నాన్ని అడ్డుకోవడం కష్టం. నేనూ ముఖ్యమంత్రిగా పనిచేశా. కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేయలేదు."

-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

మార్కెటింగ్ కోసం మోదీ పదేపదే పంజాబ్​కు వస్తారని కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలనూ రాజ్​నాథ్ ఖండించారు.

హోంశాఖ కఠిన చర్యలు!

Modi Punjab Security Supreme court: ఫిరోజ్​పుర్​లో జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ పూర్తి సమాచారాన్ని సేకరిస్తోందని, భద్రతా లోపాలపై కఠిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ విషయంపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. దేశ న్యాయవ్యవస్థ అందరికీ న్యాయం చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు.

జరిగింది ఇదీ!

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య ఫిరోజ్​పుర్​లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్​లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఫిరోజ్‌పుర్‌ జిల్లాలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించడం వల్ల.. ప్రధాని, ఆయన వాహనశ్రేణి 15-20 నిమిషాల పాటు పైవంతెనపై చిక్కుకుపోయింది. దీంతో ప్రధాని తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని దిల్లీకి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే, సభకు జనం రాలేదనే మోదీ సమావేశాన్ని రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

ఇదీ చదవండి: మోదీ దీర్ఘాయువు కోసం పూజలు- మృత్యుంజయ జపాలు

Last Updated : Jan 6, 2022, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.