ETV Bharat / bharat

PM Modi Warangal Tour : దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర: మోదీ - తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రస్తావన

PM Modi
PM Modi
author img

By

Published : Jul 8, 2023, 11:50 AM IST

Updated : Jul 8, 2023, 1:30 PM IST

11:45 July 08

దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారింది: మోదీ

దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర

Modi on Telangana Development : ప్రధాని నరేంద్ర మోదీ హనుమకొండలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 9ఏళ్లు పూర్తయిందని.. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని చెప్పారు. ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక అని వివరించారు. మరోవైపు దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని వ్యాఖ్యానించారు. దేశానికి ఇది స్వర్ణ సమయం అని మోదీ వెల్లడించారు.

Modi Telangana Tour Latest News : ఈ క్రమంలోనే రూ. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకున్నామని మోదీ వివరించారు. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నామని అన్నారు. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నామని వెల్లడించారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రీయల్‌-ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని చెప్పారు. కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నామని.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

"దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర. ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారింది. దేశానికి ఇది స్వర్ణ సమయం. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నాం. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్‌-ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయి." - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Modi on BJP Public Meeting at Hanamkonda : అంతకుముందు ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, నితిన్‌ గడ్కరీ, గవర్నర్‌ తమిళిసైతో కలిసి వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. రూ.2,147 కోట్ల వ్యయంతో... జగిత్యాల-కరీంనగర్ -వరంగల్ ఇంటర్ కారిడార్‌కు, రూ.3,441 కోట్ల వ్యయంతో ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారికి ప్రధాని శంకుస్థాపన చేశారు.

ఇవీ చదవండి: BJP Public Meeting : 'బీజేపీ ప్రభుత్వంతోనే.. తెలంగాణలో సమగ్ర అభివృద్ధి'

'ఆ నిర్ణయాలతో భారతీయ విద్యాలయాలకు ప్రపంచ గుర్తింపు'

Last Updated : Jul 8, 2023, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.