ETV Bharat / bharat

'మోదీ దేవుడు.. ఆయనకు వీరాభిమానిని.. అందుకే దండ వేయాలనుకున్నా'

ప్రధాని మోదీకి తాను వీరాభిమానినని అందుకే రోడ్‌ షోలో ఆయనకు దండ వేసేందుకు ప్రయత్నించానని ఆరోతరగతి బాలుడు కునాల్‌ అన్నాడు. దండవేసే క్రమంలో ఎస్‌పీజీ సిబ్బంది బాలుడ్ని అడ్డుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.

modi security glitch in karnataka
మోదీ నా దేవుడు
author img

By

Published : Jan 13, 2023, 10:37 PM IST

ప్రధాని మోదీ కర్ణాటక పర్యటనలో ఓ బాలుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుంటూ మోదీ మెడలో దండ వేసేందుకు రావడం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీకి తాను పెద్ద అభిమానినని, ఆయన దేవుడి లాంటి వ్యక్తి అని, అందుకే ఆయనకు దండ వేయాలనుకున్నానని ఆ బాలుడు తాజాగా చెప్పుకొచ్చాడు. నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్ణాటక వచ్చిన మోదీ హుబ్బళ్లిలో రోడ్‌ షో చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఆరోతరగతి చదువుతున్న కునాల్‌ ధొంగడి మోదీకి వీరాభిమాని. మోదీ హుబ్బళ్లి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అతడు.. తన కుటుంబ సభ్యులతో కలిసి మోదీని చూసేందుకు వెళ్లాడు. రెండున్నర ఏళ్ల వయస్సున్న తన చిన్నాన్న కొడుక్కి ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫాం ధరించి.. ఆ పిల్లాడితో మోదీ మెడలో దండ వేయాలని ఆ అబ్బాయి ప్లాన్‌. కానీ రోడ్‌ షో చేస్తున్న మోదీ.. అటువైపు చూడలేదు. ఈ లోగా కాన్వాయ్‌ వాళ్లను దాటి వెళ్లిపోతోంది. దీంతో వెంటనే బారికేడ్ల కింద నుంచి దూకేసి మోదీ మెడలో దండ వేసేందుకు యత్నించాడు. అది గమనించిన ప్రధాని కూడా ఆ దండను తీసుకునేందుకు చేయిపైకి ఎత్తారు. కానీ, అప్రమత్తమైన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ సిబ్బంది.. ఆ బాలుడ్ని వెనక్కి నెట్టేసి, అక్కడున్న సివిల్‌ కానిస్టేబుళ్లకు అప్పగించారు.

వెంటనే స్థానిక పోలీసులు బాలుడితోపాటు, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, దండ వేయడం వెనుక ఎలాంటి దురుద్దేశ లేకపోవడం వల్ల వాళ్లని విడిచిపెట్టారు. ఆ తర్వాత దండను పరిశీలించి ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్న తర్వాత దానిని మోదీకి అందించినట్లు సమాచారం. విచారణ అనంతరం కునాల్‌ తండ్రి మాట్లాడుతూ.. "పోలీసులు వాళ్ల పని వాళ్లు చేశారు. మా తప్పు ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత విడుదల చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఇతర సీనియర్‌ భాజపా నాయకులు తమకు మద్దతుగా నిలిచారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు" అని అన్నారు. ఎలాంటి దురుద్దేశం లేకపోవడం వల్ల తాము కూడా విచారణకు సహకరించామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.