Modi in UP today: వారణాసి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నగరాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
స్వర్వేద్ మహామందిర్లో జరిగిన సద్గురు సదాఫల్దేవ్ విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ సభకు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలను ప్రజలకు వివరించారు మోదీ. తాను దిల్లీలో ఉన్నా.. వారణాసిపైనే మనసు ఉంటుందని, ఇక్కడి అభివృద్ధిని చూసేందుకు తహతహలాడతానని మోదీ అన్నారు.
ఇవీ చూడండి:-