ETV Bharat / bharat

ఈసారీ కరోనా మధ్యే మోదీ 2.0 వార్షికోత్సవం

author img

By

Published : May 30, 2021, 5:31 AM IST

కరోనా దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. మోదీ సర్కారు ఏడో వసంతాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నడూ లేని పరిస్థితుల్లో, ఎప్పుడూ లేనన్ని విమర్శల మధ్య ఎనిమిదో ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టనుంది. లక్ష గ్రామాలను సందర్శించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

MODI
మోదీ

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ(NDA) సర్కారు ఏడో వసంతం పూర్తి చేసుకుంది. వరుసగా రెండో ఏడాది కరోనా మధ్యే ఈ వార్షిక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. గతేడాది ఇదే సమయానికి దేశం కరోనా గుప్పిటే ఉంది. అప్పటితో పోలిస్తే రెండో దశ మరింత తీవ్రంగా విజృంభించింది. అయితే, ఈ సారి మోదీ సర్కారుపై గతంలో ఎన్నడూ లేనన్ని విమర్శలు వచ్చాయి. కొవిడ్ నిర్వహణపై అనేక వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. మోదీకి సైతం ఆదరణ తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవంలో భాగంగా ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు భాజపా(BJP) పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కనీసం లక్ష గ్రామాల్లో పర్యటించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది. భాజపాకు చెందిన ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు సైతం ఇందులో భాగస్వామ్యం కానున్నారు. గతంలో వర్చువల్ సమావేశాలకే పరిమితమైన మంత్రులు ఈ సారి ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఇప్పుడు వేరు!

గతేడాది కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై ఈ స్థాయిలో వ్యతిరేకత లేదు. సైద్ధాంతిక హామీలైన ఆర్టికల్-370 రద్దు, రామ మందిర నిర్మాణం వంటివి సాకారం కావడం ఆ పార్టీకి మద్దతు కోల్పోకుండా చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి నిర్వహణ, టీకా పంపిణీపై కేంద్రం తీరు.. సర్కారుకు ప్రతికూలంగా మారుతున్నాయని అన్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ ప్రభావం మోదీ ప్రభుత్వంపై ఉంటుందని అంటున్నారు. ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని నేతలకు పార్టీ మార్గనిర్దేశం చేయడం వెనక కారణం కూడా ఇదేనని భావిస్తున్నారు. పరిస్థితులను శాంతింపజేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.

మరోవైపు, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో.. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం నూతన పథకం ప్రవేశపెట్టింది. 18 ఏళ్లు దాటిన తర్వాత రూ.10 లక్షల సాయంతో పాటు పైచదువులకు హామీ ఇచ్చింది. 'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రెన్' పథకం ద్వారా ఈ సాయం అందిస్తామని స్పష్టం చేసింది. కొవిడ్​ సంక్షోభంతో చిన్నాభిన్నమైన నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం.

ఇదీ చదవండి- అనాథ చిన్నారులకు పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.