మంత్రులకు శాఖలు కేటాయింపు..
మంత్రి వర్గం విస్తరించిన అనంతరం.. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించింది ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీనే.. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షించనున్నారు.
కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షా.. కొత్తగా ఏర్పాటైన సహకార మంత్రిత్వ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు.
- జ్యోతిరాదిత్య సింధియా- పౌర విమానయాన శాఖ
- హర్‌దీప్ సింగ్ పూరీ - పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ
- మన్‌సుఖ్ మాండవీయ - ఆరోగ్యశాఖ
- అమిత్ షా - హోంశాఖతో పాటు కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన సహకార శాఖ
- అనురాగ్‌ఠాకూర్ - సమాచార, ప్రసారాలు; క్రీడలు
- పీయూష్ గోయల్ - వాణిజ్య శాఖకు అదనంగా జౌళి శాఖ
- అశ్వినీ వైష్ణవ్ - రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు
- భూపేంద్ర యాదవ్ -కార్మిక శాఖ
- పశుపతి కుమార్ పారస్ - ఆహార శుద్ధి
- స్మృతి ఇరానీ- మహిళా, శిశుసంక్షేమశాఖ
- ధర్మేంద్ర ప్రదాన్ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ
- గిరిరాజ్ సింగ్- గ్రామీణాభివృద్ధి
- పురుషోత్తం రూపాలా - డెయిరీ, మత్స్య శాఖ