ETV Bharat / bharat

Mobile Blast In Nashik : బాంబ్​లా పేలిన మొబైల్​ ఫోన్​.. కిటికీలు, సామాన్లు ధ్వంసం.. చుట్టుపక్కల ఇళ్లు కాడా.. - మహారాష్ట్రలో ఫోన్​ బ్లాస్ట్ ముగ్గురికి తీవ్రగాయాలు

Mobile Blast In Nashik : ఛార్జింగ్​లో పెట్టిన మొబైల్​ ఫోన్​ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇంటి కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు, తలుపులు కూడా దెబ్బతినడం గమనార్హం. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా​లో జరిగింది.

Nashik Mobile Blast News
Mobile Blast In Nashik
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 3:43 PM IST

Updated : Sep 27, 2023, 4:16 PM IST

Mobile Blast In Nashik : ఛార్జింగ్​లో పెట్టిన మొబైల్​ ఫోన్​ ఒక్కసారిగా పేలడం వల్ల ఇంటి కిటికీలు, సామగ్రి ధ్వంసమయిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లాలో జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు, తలుపులు కూడా తీవ్రంగా దెబ్బతినడం గమనార్హం. కేవలం మొబైల్​ ఫోన్​ పేలుడుకే ఇంత పెద్దమొత్తంలో నష్టం వాటిల్లడం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో ఇంట్లో నివాసం ఉంటున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

చుట్టుపక్కల ఇళ్లు కూడా..
తుషార్​ జగ్​తాప్​, శోభా జగ్​తాప్​, బాలకృష్ణ సుతార్​ కలిసి నాసిక్​ ప్రతాప్​నగర్​లోని సిడ్కో ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సెప్టెంబర్​ 27న ఈ ముగ్గురిలో ఒకరు తమ మొబైల్​ ఫోన్​ను ఛార్జింగ్​ పెట్టారు. ఉన్నట్టుండి బుధవారం ఉదయం ఛార్జింగ్​ పెట్టిన ఫోన్​ భారీ శబ్దంతో పేలింది. ఈ పేలుడు ధాటికి ఇంట్లోనే ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు గాయపడిన వారిని దగ్గర్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Three Are Critical Nashik Mobile Blast
ఫోన్​ పేలుడు ధాటికి ధ్వంసమైన ఇంట్లోని సామగ్రి.

A TERRIBLE EXPLOSION OF A CHARGING MOBILE PHONE IN NASHIK
దెబ్బతిన్న ఇంటి కిటికీలు.

జేబులో పేలిన కీప్యాడ్​​ ఫోన్​!
ఇటీవలే కేరళలోని త్రిస్సూర్​ నగరంలో 76 ఏళ్ల ఇలియాస్ అనే వృద్ధుడి జేబులో ఉన్న కీ ప్యాడ్​ ఫోన్​ ఉన్నట్టుండి పేలిపోయింది. దీంతో అతడి షర్ట్​కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన వృద్ధుడు జేబులో నుంచి ఫోన్​ను తీసి కిందకు విసిరేశాడు. అనంతరం మొబైల్​కు అంటుకున్న మంటలను ఆర్పేశాడు. దీంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఇలియాస్​ ఓ హోటల్లో టీ తాగుతూ కూర్చున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి లైవ్​ వీడియో అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మొబైల్ పేలిందని కోర్టులో దావా!
కొద్దనెలల క్రితమే కేరళలోని కోజికోడ్​లో కూడా ఈ తరహా ఘటనే వెలుగు చూసింది. 23 ఏళ్ల ఫారిస్ రెహమాన్​ అనే యువకుడు జీన్స్​ ప్యాంట్​ జేబులో పెట్టుకున్న మొబైల్ ఫొన్​ అకస్మాత్తుగా బ్లాస్ట్​ అయింది. దీంతో అతడు ధరించిన జీన్స్​ ప్యాంట్​కు మంటలు అంటుకొని మొబైల్​ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా, పేలుడుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత యువకుడు.. తయారీ సంస్థపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Train Hits Platform Viral Video : బ్రేకులు ఫెయిల్​.. ప్లాట్​ఫాంపైకి దూసుకొచ్చిన రైలు.. లక్కీగా..

Termites Eat Money : బ్యాంక్​ లాకర్​లో 'చెదలు'.. రూ.18లక్షలు స్వాహా.. ఆమెకు ఆ విషయం తెలియదట!

Last Updated : Sep 27, 2023, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.