ETV Bharat / bharat

యువకుడిపై మూకదాడి చేసి సజీవదహనం- శవాన్ని ఇవ్వకుండా.. - ఝార్ఖండ్ మూకదాడి

అక్రమంగా చెట్లు నరుకుతున్నాడన్న కారణంతో ఓ యువకుడిపై మూకదాడి చేసి చంపేశారు గ్రామస్థులు. తీవ్రంగా కొట్టి యువకుడికి నిప్పంటించారు. అనంతరం పోలీసులకు శవాన్ని అప్పగించేందుకూ నిరాకరించారు.

mob lynching in jharkhand
యువకుడిపై మూకదాడి
author img

By

Published : Jan 4, 2022, 9:20 PM IST

Mob lynching in Jharkhand: కలప కోసం అక్రమంగా చెట్లు నరికేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిపై గ్రామస్థులు మూకదాడి చేశారు. అనంతరం యువకుడి శరీరానికి నిప్పంటించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఝార్ఖండ్​ సిమ్దేగా జిల్లాలోని బేస్రజరా బజార్​లో ఈ ఘటన జరిగింది.

mob lynching in simdega
యువకుడు సజీవ దహనం

మృతుడిని సంజూ ప్రధాన్​గా (30)​ గుర్తించారు అధికారులు. నిందితుడు చెట్లు నరుకుతున్నాడని తెలుసుకొని వందల సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అతడు చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పోలీసులకు అప్పగించేందుకూ నిరాకరించారు. గ్రామస్థులతో పోలీసులు అనేక గంటలు మంతనాలు జరిపిన తర్వాత శవాన్ని తీసుకెళ్లేందుకు అనుమతించారు.

మూకదాడులకు వ్యతిరేకంగా రూపొందించిన బిల్లును ఝార్ఖండ్ అసెంబ్లీ ఆమోదించిన పక్షం రోజుల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. మూకదాడులకు పాల్పడినవారికి మూడేళ్ల నుంచి జీవితకాల జైలుశిక్ష విధించేలా ఈ బిల్లు తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం నిందితులకు జరిమానా విధించడం సహా ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది. బంగాల్, రాజస్థాన్​ రాష్ట్రాలు సైతం ఇదివరకే ఈ తరహా చట్టాలను తీసుకొచ్చాయి.

ఇదీ చదవండి: 22 ఏళ్ల తర్వాత అమ్మ చెంతకు కుమార్తె.. వారి ఆనందానికి హద్దే లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.