ETV Bharat / bharat

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. దారుణంగా కొట్టి చంపిన 22 మంది

తమ గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై మూకదాడి చేశారు దుండగులు. ఈ దాడిలో బాధితుడు మరణించాడు. ఈ దారుణం ఝూర్ఖండ్​లో జరిగింది. మరోవైపు, ఓ మైనర్​ను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు కామాంధులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

mob lynching in bokaro
మూకదాడి
author img

By

Published : Oct 7, 2022, 5:19 PM IST

ఝార్ఖండ్ బొకారోలో దారుణం జరిగింది. మహుటాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధ్వయ అనే గ్రామంలో ఓ వ్యక్తిపై మూకదాడి జరిగింది. ఈ ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రికి తరలించేసరికి మృతి చెందాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. మృతుడు వార్డు మెంబర్ అని పేర్కొన్నారు. గురువారం జరిగిన దుర్గాదేవీ నిమజ్జనం సమయంలో ఓ వర్గానికి చెందిన 22 మంది మరో వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేశారు. ఫలితంగా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం వల్ల పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడికి ధ్వయ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొందరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి దుర్గామాత నిమజ్జనం సమయంలో అదును చూసి మూకదాడికి పాల్పడ్డారు. బాధితుడికి తీవ్ర గాయలవ్వగా.. రామ్‌ఘఢ్ ఆసుపత్రిలో పోలీసులు చేర్చారు. బాధితుడి ఆరోగ్యం విషమించడం వల్ల రాంచీలోని ఓ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసులో 22 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నారు. అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

కిడ్నాప్ చేసి..
ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో దారుణం జరిగింది. ఓ మైనర్​ను కిడ్నాప్ చేసి.. నాలుగు రోజులు బందీగా ఉంచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు కామాంధులు. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిప్రీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మైనర్​.. తనను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారందరూ తన గ్రామానికి చెందిన వారేనని తెలిపింది. దీంతో బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. సెప్టెంబరు 4న బాధితురాలు కిడ్నాప్​కు గురైంది. ఆ తర్వాత రోజు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు బంధీగా ఉన్న మైనర్​ను రక్షించారు.

బ్లాక్​మెయిల్ చేసి..
బిహార్ పట్నాలో ఏడాది క్రితం అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పత్రకార్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్​గా పనిచేసేవాడు నిందితుడు రాజేశ్​. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న బాధితురాలితో పరిచయం ఏర్పడింది. ఆమె రూమ్​కు సమీపంలోనే నిందితుడు కూడా రూమ్ తీసుకున్నాడు. ఓ రోజు బలవంతంగా బాధితురాలికి మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ దారుణాన్ని వీడియో తీసి ఆమెను బ్లాక్​మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనమాట వినకపోతే ముఖంపై యాసిడ్ పోసేస్తానని బెదిరించేవాడు. విసుగుచెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాది తర్వాత పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి మొబైల్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి: రాత్రి 7 కాగానే టీవీలు, ఫోన్లు బంద్.. ఆ గ్రామంలో స్ట్రిక్ట్​గా రూల్​ అమలు!

'మతం మారినా ఎస్సీ హోదా'.. కమిషన్ ఏర్పాటు చేసిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.