ETV Bharat / bharat

ఈడీ నోటీసులపై సుప్రీంను ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత - ఈడీ విచారణపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవిత

MLC Kavitha approached Supreme Court on ED notices: దిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడాన్నికవిత ఖండించారు.

MLC Kavitha
MLC Kavitha
author img

By

Published : Mar 15, 2023, 11:39 AM IST

Updated : Mar 15, 2023, 12:48 PM IST

MLC Kavitha approached Supreme Court on ED notices: దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న దిల్లీ మద్యం కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇటీవలే ఈడీ విచారణ ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవితను ఈనెల 16న మరోసారి హాజరవ్వాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని ఖండించిన ఆమె.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

MLC Kavitha Petition in Supreme Court on ED notices : సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించిన కవిత తరపున న్యాయవాదులు.. చట్ట విరుద్ధంగా మహిళను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలిచారని వివరించారు. నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామన్నారనీ.. కానీ అలా చేయలేదని ప్రస్తావించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన మొబైల్ ఫోన్ సీజ్ చేశారని ధర్మాసనానికి తెలిపారు.

ఈడీ విచారణపై కవిత తరుపు న్యాయవాదులు మధ్యంతర ఉత్తర్వులు కోరగా ధర్మాసనం నిరాకరించింది. రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరు కానున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు మౌనం వహించింది. పిటిషన్​పై వెంటనే విచారణ చేపట్టేందుకు కూడా నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.

లిక్కర్ స్కామ్​లో కవిత.. ఈనెల 11న ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఆరోజున ఈడీ అధికారులు కవితను 8 గంటల పాటు ప్రశ్నించారు. వాస్తవానికి ఈనెల 9నే కవిత విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాల వల్ల 11వ తేదీని హాజరవుతానని దర్యాప్తు సంస్థకు సమాచారమిచ్చారు. చెప్పినట్టుగానే ఈనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సాయంత్రం 4గంటలు వరకు కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఆ తరువాత భోజన విరామమిచ్చారు. ఓ గంట విరామం తర్వాత 5గంటలకు మళ్లీ చేపట్టారు.

ఈ విచారణలో తొలుత కవిత మాజీ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ బుచ్చిబాబు, మద్యం కేసులో ఆమెకు బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈడీ అధికారులు పశ్నించారు. ఈ సమయంలోనే డిజిటల్‌ ఆధారాలు లభించకుండా ధ్వంసం చేయడం, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాలతో భేటీలపై కూడా ఆరా తీశారు. తర్వాత అరుణ్‌ పిళ్లైతో కలిపి ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

మద్యం కేసుతో తనకు సంబంధం లేదన్న కవిత.. 16న మళ్లీ రావాలన్న ఈడీ

ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ... ఈనెల 16న మరోసారి రావాలని నోటీసులు

కొద్దిరోజుల్లో కల్వకుంట్ల కవిత జైలుకెళ్లడం ఖాయం: అర్వింద్‌

Last Updated : Mar 15, 2023, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.