ఎప్పుడూ వివాదాల్లో ఉండే.. పంజాబ్ బువా నియోజకవర్గ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ మరోసారి రెచ్చిపోయారు. బహిరంగంగా ఓ బాలుడిని చెంపదెబ్బ కొట్టారు. అంతటితో ఆగకుండా.. చితకబాదారు. పోలీసులు కూడా చేయిచేసుకోవడం గమనార్హం. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ జరిగింది..
మంగళవారం రాత్రి ఓ కార్యక్రమానికి హాజరై.. ప్రసంగిస్తున్నారు ఎమ్మెల్యే. ఈ సమయంలో.. ఆయనతో మాట్లాడేందుకు ముందుకు వచ్చిన ఓ బాలుడికి మైక్ ఇచ్చారు. 'ఇప్పటివరకు నియోజకవర్గానికి మీరేం చేశారు?' అని ఆ వ్యక్తి ప్రశ్నించగా.. వెంటనే చెంప చెళ్లుమనిపించారా శాసనసభ్యుడు. పక్కనే ఉన్న ఆయన అనుచరులు, పోలీసులు కూడా చేయి చేసుకున్నారు. చివరకు ఎలాగో అక్కడి నుంచి బాధితుడు తప్పించుకున్నాడు.
ఈ విషయమై బాలుడి కుటుంబసభ్యులు.. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే తప్పేంటని అంటున్నారు.
ఇదీ చూడండి: విమానంలో నటిపై వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్