MLA rejoins Congress from BJP: రాజకీయ నేతలు ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరడం సర్వసాధారణమే. అలా వెళ్లిన వారు ఆ కొత్త పార్టీ విధానాలు నచ్చకనో.. లేదా మరే ఇతర కారణంతోనే తిరిగి సొంత పార్టీలో చేరుతుంటారు. అయితే.. పంజాబ్లో ఓ ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ను వీడి కమలం గూటికి చేరి... పట్టుమని పదిరోజులు కూడా కాకమునుపే తిరిగి హస్తం కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది.
Mla return to congress after six days: పంజాబ్లో శ్రీ హర్గోవింద్పుర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మల్యే బల్వీందర్ సింగ్ లద్దీ.. ఖైదాన్ ఎమ్మెల్యే ఫతేజంగ్ బజ్వాతో కలిసి డిసెంబరు 28న దిల్లీకి వెళ్లి భాజపాలో చేరారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో వారిద్దరూ కమలం కండువా కప్పుకున్నారు.
MLA Balwinder Singh Laddi: అయితే.. ఆరు రోజుల అనంతరం బల్వీంద్ సింగ్... ఆదివారం రాత్రి ఏఐసీసీ పంజాబ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీశ్ చౌదరి, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్లో చేరారు. ఈ విషయాన్ని బల్వీందర్ సోమవారం స్వయంగా వెల్లడించారు.
ఇదీ చూడండి: 'మహిళా వ్యతిరేక చర్యలపై గళమెత్తాల్సిన సమయమిదే!'
ఇదీ చూడండి: సర్కారుపై బధిర క్రీడాకారిణి ఆగ్రహం.. హామీ నిలబెట్టుకోండంటూ..