MLA Rajasingh React on Chandrababu Naidu Arrest : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu Arrest) అరెస్టును తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టు తప్పుడు విధానంలో జరిగిందన్నారు. కేసుతో సంబంధం లేకపోయినా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ రకంగా చంద్రబాబును చూస్తే జగన్ భయపడుతున్నారని అర్థమవుతుందని తెలిపారు. గోషామహల్‌లోని పార్టీ కార్యాలయంలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే ఆయన అంతగా ఎదుగుతారని ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. ఈసారి కచ్చితంగా 2024లో జరిగే ఏపీ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. జగన్ ఏం చేశారు.. ఏం చేస్తున్నారనేది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసన్నారు. ప్రజల సేవ కోసమే చంద్రబాబు జైలుకు వెళ్లారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. టీడీపీ అధినేతపై పెట్టిన కేసును కోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
"చంద్రబాబును చూసి జగన్ భయపడుతున్నారు. కేసుతో సంబంధం లేకపోయినా అరెస్టు చేశారు. చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే అంతగా ఎదుగుతారు. 2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ఏం చేశాడు.. ఏం చేస్తున్నాడనేది ప్రజలకు తెలుసు. ప్రజల సేవ కోసం చంద్రబాబు జైలుకు వెళ్లారు. చంద్రబాబుపై పెట్టిన కేసు కోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నాను." - రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యే
Bandi Sanjay Comments on AP Govt : అంతకుముందు గురువారం చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని బీజేపీ నేత బండి సంజయ్ పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా.. హడావిడిగా ఆయనను అరెస్టు చేయడం సరైనది కాదని అన్నారు. వాళ్లు తీసిన గోతుల్లోనే వాళ్లు పడే పరిస్థితి వచ్చిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి తప్పా.. ఇలా వ్యక్తిగత కక్షలు తగవన్నారు.
ఈ అరెస్టుతో చంద్రబాబుకు ఏపీ ప్రజల్లో ఫుల్ మైలేజీ వచ్చిందని.. అందుకు ఇతర రాజకీయ పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా స్పందించడమే నిదర్శనమని అన్నారు. ఏపీ ప్రభుత్వం తన తప్పును తాను తెలుసుకోకపోతే.. జనాలు తిరుగుబాటు చేయడం ఖాయమన్నారు. ఇక ఏపీ ప్రజలు అడిగే ప్రశ్నలకు వైసీపీ నాయకులు సమాధానాలు చెప్పలేరని.. అలా నిలదీస్తే చెప్పే ధైర్యం వారికి ఉందా అని ప్రశ్నించారు. తాను ఈ విధంగా మాట్లాడినందుకు చంద్రబాబు లేదా పవన్‌కల్యాణ్ ఏజెంటుననే ప్రచారం చేసే అలవాటు వైసీపీ నాయకులకు ఉందన్నారు.
Kishanreddy on TDP Chief Arrest : మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విధానం సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఒక మాజీ సీఎంను అరెస్టు చేస్తున్నప్పుడు, ముందుగా పిలిచి మాట్లాడాల్సి ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం సంయమనం పాటించాల్సి ఉంటే బాగుండేదని చెప్పారు. అంతకంటే ముందే బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్.. చంద్రబాబు అరెస్టును బీజేపీ ఖండిస్తుందని చెప్పారు.
Bandi Sanjay on Chandrababu Arrest : 'అరెస్టుతో చంద్రబాబుకు ప్రజల్లో మైలేజ్ వచ్చింది'