TDP's Panchumarthi Anuradha wins MLC: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకు షాక్ తగిలింది. వైనాట్ 175 అంటూ జగన్ ఓ వైపు ప్రచారం చేస్తుంటే స్వంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్కు జలకిచ్చారు. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లయింది. వైసీపీ నేతలు మెుదటి నుంచి తాము 7 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుంటామని చెప్పినప్పటికీ.. ఆత్మప్రబోధం మేరకు వేసిన ఓట్లతో వైసీపీ ఏడో అభ్యర్థిని గెలవలేకపోయింది. 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనుహ్య విజయం సాధించారు.
ఆరుగురు వైసీపీ, ఒక టీడీపీ అభ్యర్థి విజయం: 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన కౌంటింగ్లో ఆరుగురు వైసీపీ, ఒక టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థులు సూర్యనారాయణ రాజు, పోతుల సునీత, బొమ్మి ఇశ్రాయేలు, చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ విజయం సాధించగా... మెుదట పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రాగా.. ఆమె విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఓట్లను మళ్లీ లెక్కించాలని వైసీపీ అభ్యర్థించిన మేర అధికారులు ఓట్లను మళ్లీ లెక్కించారు. రెండో సారి లెక్కింపులో సైతం పంచమర్తి అనురాధ విజయం సాదించినట్లు అధికారులు ప్రకటించారు.
ఎన్నికల ఫలితాల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉత్కంఠ లేపింది. ఏడో స్థానం కోసం కోలా గురువులు, జయమంగళ మధ్య పోటీ నెలకొంది. కోలా గురువులు, జయమంగళ మధ్య జరిగిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తరువాత చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లతో జయమంగళ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
పంచుమర్తి అనురాధ: పంచుమర్తి అనురాధ M.Sc. Ph.D. (Political Communications) చేశారు. తెలుగుదేశం పార్టీలో గత 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. 2000-2001 విజయవాడ మేయర్గా పనిచేశారు. 2009 టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి తీర ప్రాంతంలోని నేత కమ్యూనిటీకి పలు సేవలందిస్తున్నారు. 2016 లో మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్గా ఆ సంస్థకు అనేక అవార్డులు సాధించారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరీ ద్వారా 300 మంది IAS ట్రైనీలకు నాయకత్వం కళ, మంచి పరిపాలన కోసం బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకుల మధ్య సంబంధాల గురించి శిక్షణ అందించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరాటం చేసినందుకు 2019 నుంచి నేటి వరకు 10కి పైగా కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: