Mizoram New CM Swearing Ceremony : ఈశాన్య రాష్ట్రం మిజోరం నూతన ముఖ్యమంత్రిగా 'జోరం పీపుల్స్ మూవ్‌మెంట్- ZPM' పార్టీ అధ్యక్షుడు లాల్‌దుహోమా శుక్రవారం ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు అయిజోల్‌లోని రాజ్‌భవన్ కంప్లెక్స్‌లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. లాల్‌దుహోమాతో పాటు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో 11 మంది జెడ్‌పీఎం నేతలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు గవర్నర్.
-
#WATCH | Aizawl, Mizoram: Zoram People's Movement (ZPM) leader Lalduhoma takes oath as the Chief Minister of Mizoram as the swearing-in ceremony begins pic.twitter.com/oCMbU2xVSf
— ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Aizawl, Mizoram: Zoram People's Movement (ZPM) leader Lalduhoma takes oath as the Chief Minister of Mizoram as the swearing-in ceremony begins pic.twitter.com/oCMbU2xVSf
— ANI (@ANI) December 8, 2023#WATCH | Aizawl, Mizoram: Zoram People's Movement (ZPM) leader Lalduhoma takes oath as the Chief Minister of Mizoram as the swearing-in ceremony begins pic.twitter.com/oCMbU2xVSf
— ANI (@ANI) December 8, 2023
Lalduhoma Mizoram 9th New CM : కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ సీఎం జొరాంథంగా కూడా హాజరయ్యారు. ఎంఎన్‌ఎఫ్ శాసనసభా పక్ష నేత లాల్‌చందమా రాల్టేతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మరో మాజీ ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక జెడ్‌పీఎం పార్టీ నాయకుడిగా లాల్‌దుహోమాను, ఉపాధ్యక్షుడిగా కె.సప్దంగను మంగళవారం ఎన్నుకున్నారు పార్టీ నేతలు.
Mizoram Election Results 2023 : 2019లో రాజకీయ పార్టీగా నమోదైన ZPM.. 2018 ఎన్నికలలో 8 స్థానాలు కైవసం చుసుకుంది. ఇప్పుడు ఆ సంఖ్యను 27కు పెంచుకుని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిజోరంలో ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు అవసరం. 2018 ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) ఈసారి కేవలం 10 సీట్లకే పరిమితమైంది. తద్వారా అధికార ఎంఎన్‌ఎఫ్ సాగించిన ఐదేళ్ల పాలనకు ముగింపు పలికినట్లయింది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ 5 చోట్ల గెలవగా.. బీజేపీ ఒక సీటును మాత్రమే దక్కించుకుంది.
Mizoram Assembly Elections 2023 : 8.57 లక్షల మంది ఓటర్లున్న మిజోరంలో నవంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. ఇందులో 80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 మంది మహిళలతో పాటు మొత్తం 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జెడ్‌పీఎం, ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేయగా.. బీజేపీ 23 స్థానాల్లో మాత్రమే తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారి నాలుగు స్థానాల్లో అభ్యర్థులను దింపగా.. ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. కాగా, మిజోరంలో ఈసారి రికార్డు స్థాయిలో 77 శాతం పోలింగ్ నమోదైంది.
2023లో పార్టీలు గెలిచిన సీట్లు
పార్టీ | సీట్లు |
ZPM | 27 |
MNF | 10 |
BJP | 02 |
CONG | 01 |
మిజోరంలో మేజిక్ ఫిగర్ దాటిన ప్రతిపక్ష ZPM- ముఖ్యమంత్రి అభ్యర్థి గెలుపు
మిజోరం పీఠం ZPMదే- కొత్త సీఎంగా ఇందిరాగాంధీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్- ఎవరీయన?