ETV Bharat / bharat

మిథున్ చక్రవర్తికి 'వై ప్లస్' భద్రత

మిథున్ చక్రవర్తికి కేంద్రం వీఐపీ భద్రతను కల్పించనుంది. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. భద్రత సంస్థల సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

mithun
మిథున్ చక్రవర్తికి వీఐపీ భద్రత
author img

By

Published : Mar 11, 2021, 5:31 AM IST

ఇటీవల భాజపాలో చేరిన బాలీవుడ్​ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తికి కేంద్రం వీఐపీ భద్రతను కల్పించనుంది. ఆయన​కు వై ప్లస్​ కేటగిరీ రక్షణను అందించనుంది. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో వై ప్లస్​ రక్షణతో పాటు సీఐఎస్​ఎఫ్​ కమాండోలు కూడా మిథున్​ వెంట ఉంటారని స్పష్టం చేశారు.

భద్రత సంస్థల సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఝార్ఖండ్​ భాజపా ఎంపీ నిశికాంత్ దుబెకు కూడా కేంద్రం ఇదే తరహా భద్రతను కల్పించనుంది. దీంతో దేశవ్యాప్తంగా సీఐఎస్​ఎఫ్​ రక్షణ పొందుతున్న వారి సంఖ్య 104కి చేరింది.

ఇదీ చదవండి : మిథున్‌ 'చక్రం'.. భాజపా కొత్త అస్త్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.