ETV Bharat / bharat

థెరిసా మిషనరీల 'ఖాతాల ఫ్రీజ్'​పై రాజకీయ దుమారం

author img

By

Published : Dec 27, 2021, 4:56 PM IST

Updated : Dec 27, 2021, 7:35 PM IST

missionaries of charity bank account frozen: పేద ప్రజల కోసం మదర్​ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్​ ఛారిటీ బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని వచ్చిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో కేంద్ర హోంశాఖ దీనిపై స్పష్టతనిచ్చింది. తాము ఖాతాలను ఫ్రీజ్ చేయలేదని తెలిపింది.

Missionaries of Charity
మమతా బెనర్జీ

Missionaries of charity bank account frozen: మదర్​ థెరిసా పేదల కోసం స్థాపించిన మిషనరీస్ ఆఫ్​ ఛారిటీకి చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసిందని వచ్చిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఖాతాల ఫ్రీజ్​ అంశాన్ని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్​ వేదికగా లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు.

"మదర్​ థెరిసా స్థాపించిన మిషనరీస్​ ఆఫ్​ ఛారిటీకి చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపజేసిందనే వార్తను క్రిస్మస్​ రోజున వినటం దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో వాటిల్లోని 22వేల మంది రోగులు, ఉద్యోగులు ఔషధాలు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. చట్టం ప్రధానమైనప్పటికీ, మానవతా ప్రయత్నాలలో ఎలాంటి రాజీ ఉండకూడదు."

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

మమత ట్వీట్ చేసే సమయానికి కోల్​కతాలోని మిషనరీస్​ ఆఫ్​ ఛారిటీ కార్యాలయం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, ఈ అంశాన్ని రాష్ట్ర సర్కార్ దృష్టికి ఛారిటీ సంస్థ తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.

హోంశాఖ స్పష్టత..

అయితే తాము మిషనరీస్​ ఆఫ్ ఛారిటీ​ ఖాతాలను ఫ్రీజ్ చేయలేదని కేంద్ర హోంమంత్రిత్వశాఖ స్పష్టతనిచ్చింది. సంబంధిత మిషనరీలే ఖాతాలను నిలిపివేయాలని కోరినట్లు ఎస్​బీఐ తమకు సమాచారం ఇచ్చిందని వివరణ ఇచ్చింది.

"మిషనరీస్​ ఆఫ్​ ఛారిటీ విదేశీ విరాళాల చట్టం ప్రకారం చేయాల్సిన​ రెన్యువల్ దరఖాస్తు డిసెంబర్ 25న తిరస్కరణకు గురైంది. నిబంధనలు పాటించనందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే దరఖాస్తులను పునః​సమీక్షించాలని మాకు ఎలాంటి విజ్ఞప్తులు అందలేదు. ఈ మిషనరీల రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్​ 31తో ముగిసింది. కానీ హోంశాఖ డిసెంబర్​ 31వరకు దాన్ని పొడిగించింది. మిషనరీల బ్యాంకు ఖాతాలను కూడా కేంద్రం ఫ్రీజ్​ చేయలేదు. మిషనరీలే తమ ఖాతాలను ఫ్రీజ్​ చేయాలని ఎస్​బీఐని విజ్ఞప్తి చేశాయి.​ "

-కేంద్ర హోంమంత్రిత్వ శాఖ

మిషనరీస్​ ఆఫ్​ ఛారిటీని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారత రత్న మదర్ థెరిసా 1950లో స్థాపించారు.

ఖాతాలు ఫ్రీజ్​ చేయలేదు..

ఖాతాల ఫ్రీజ్​ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో మిషనరీస్ ఆఫ్​ ఛారిటీ దీనిపై స్పందించింది. తమ రిజిస్ట్రేషన్ సస్పెండ్ కానీ రద్దు కానీ కాలేదని వెల్లడించింది. తమకు సంబంధించిన ఖాతాలను ఫ్రీజ్ చేయాలని హోంశాఖ కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈమేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

missionaries-of-charity, మిషనరీస్​ ఆఫ్​ ఛారిటీ
మిషనరీస్​ ఆఫ్​ ఛారిటీ అధికారిక ప్రకటన

ఇదీ చూడండి: ఆ లక్ష్యాన్ని గడువుకు ముందే చేరుకున్నాం: మోదీ

ఇంటర్​ టాపర్లకు క్యాష్​ ప్రైజ్​, ట్యాబ్​ల పంపిణీ!

గంగాజలం పోయగానే కళ్లు తెరిచి మాట్లాడిన శవం!

Last Updated : Dec 27, 2021, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.