ETV Bharat / bharat

బంగాల్​లో జెండా పాతేందుకు భాజపా 'పర్యటనలు' - Amit Shah

వచ్చే ఏడాది బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మిషన్​ బంగాల్​ను ప్రారంభించింది భాజపా. ఈ మేరకు కేంద్ర హోమంత్రి సహా అమిత్​ షా సహా పలువురు కీలక నేతలు రానున్న రోజుల్లో బంగాల్​లో పర్యటించనున్నారు.

Mission Bengal: Host of BJP ministers, including Amit Shah, to visit state
మిషన్​ బంగాల్​: భాజపా కీలక నేతల పర్యటన
author img

By

Published : Dec 17, 2020, 2:22 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన వ్యూహాలు రచిస్తోంది భాజపా. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీలోని అగ్రనేతలను ఇప్పటి నుంచే రంగంలోకి దింపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సహా గజేంద్ర షెకావత్​, సంజీవ్​ బలయాన్​, ప్రహ్లాద్​ పటేల్​, అర్జున్​ ముండా, ముకేశ్​ మాండవియా బంగాల్​లో పర్యటించనున్నారు. అమిత్​ షా ఈ వారాంతంలో రాష్ట్రానికి రానుండగా.. ఇతరులు మరికొన్ని రోజుల్లో పర్యటిస్తారు.

ఇప్పటికే ఉత్తర్​ ప్రదేశ్​ డిప్యూటీ సీఎం కేశవ్​ ప్రసాద్​ మౌర్య, మధ్యప్రదేశ్ కేబినెట్​ మంత్రి నరోత్తమ్​ మిశ్రకు బంగాల్​ ఎన్నికల బాధ్యతను అప్పగించింది పార్టీ అధిష్ఠానం. వీరంతా ఈ నెల 19న షా నేతృత్వంలో జరగనున్న భేటీకి హాజరుకానున్నారు.

మరోవైపు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన టీఎంసీ కీలక నేత సువేందు అధికారి.. భాజపాలో చేరునునున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఈ వార్త కమల దళంలో ఉత్తేజాన్ని నింపుతోంది.

ఇదీ చూడండి: 'కూర్చొని నిరసనలు చేస్తే సరిపోదు-చర్చలే మార్గం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.