youth dead body in well: ఉత్తర్‌ప్రదేశ్ మథురలో 150 అడుగులు తవ్వి యువకుడి శవాన్ని వెలికితీశారు పోలీసులు. జేసీబీ సాయంతో 7 రోజుల పాటు శ్రమించి మృతదేహాన్ని కనుగొన్నారు. గతేడాది డిసెంబర్ 23న అతడు అదృశ్యమైనట్లు చెప్పారు.
కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్‌కు చెందిన మృతుడి పేరు వీరూ చౌదరి. ఇద్దరు స్నేహితులే అతడ్ని హత్య చేశారు. పోలీసుల విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు. జల్ నిగమ్ సమీపంలోని డంపింగ్ యార్డులో ఉన్న బావిలోకి వీరూను తోసేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇటుకలు, రాళ్లు, చెత్త వేసినట్లు చెప్పారు.
![missing-youth-body-recovered-from-well](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-mat-05-after-excavating-oneanda-half-hundred-feetofa-young-man-missing-for1month-thedead-bodywas-foundby-friends-only-1byte-visual-10057_01022022175702_0102f_1643718422_649.jpg)
అయితే స్థానికులు మాత్రం యువకుడి మృతికి అక్రమ సంబంధమే కారణం అని చెబుతున్నారు. అందుకే స్నేహితులే అతడ్ని హత్య చేసి ఉంటారని మాట్లాడుకుంటున్నారు. పోలీసులు మాత్రం హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. విచారణ తర్వాతే అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
![missing-youth-body-recovered-from-well](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-mat-05-after-excavating-oneanda-half-hundred-feetofa-young-man-missing-for1month-thedead-bodywas-foundby-friends-only-1byte-visual-10057_01022022175702_0102f_1643718422_275.jpg)
డిసెంబర్ 23న వీరూ అదృశ్యమయ్యాడు. జనవరి 15న అతని తల్లిదండ్రులు తమ కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో స్నేహితులను విచారించగా అసలు విషయం బయటపడింది.
![missing-youth-body-recovered-from-well](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14351862_700_14351862_1643803052151.png)
అయితే వీరూను బావిలో తోసేశామని స్నేహితులు చెప్పాక అక్కడికి వెళ్లి చూసిన పోలీసులు అవాక్కయ్యారు. మొత్తం రాళ్లు, చెత్తతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. దీంతో జేసీబీ సాయంతో గత బుధవారం నుంచి తవ్వడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు మంగళవారం అతడి శవాన్ని గుర్తించారు. భౌతికకాయం బాగా కుళ్లిపోవడం వల్ల హుటాహుటిన పోస్ట్‌మార్టానికి తరలించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ఆడీ కార్ ఓనర్ కిరాతకానికి శునకం బలి.. అంత్యక్రియలు చేసిన నటి