ETV Bharat / bharat

'మైనార్టీలను బలహీన వర్గాలుగా గుర్తించాలి' - ఎన్​సీఎం ప్రమాణపత్రం

మైనారిటీలను బలహీన వర్గాలుగా గుర్తించాలని జాతీయ మైనారిటీ కమిషన్‌(ఎన్‌సీఎం) సుప్రీంకోర్టును కోరింది. రాజ్యాంగ పరమైన రక్షణలు ఉన్నప్పటికీ అసమానత, వివక్షకు గురవుతున్నామన్న భావన మైనారిటీల్లో ఉందని.. 46వ అధికరణానికి అనుగుణంగా ఈ గుర్తింపు ఇస్తే మంచిదని పేర్కొంది. ఈ మేరకు ప్రమాణపత్రాన్ని సమర్పించింది.

supreme court
సుప్రీం కోర్టు
author img

By

Published : Aug 3, 2021, 6:55 AM IST

దేశంలోని మైనారిటీలను బలహీన వర్గాలుగా గుర్తించాలని జాతీయ మైనారిటీ కమిషన్‌(ఎన్‌సీఎం) సుప్రీంకోర్టును కోరింది. మెజార్టీ వర్గీయుల ప్రాబల్యం అధికంగా ఉన్నందున ఈ ఏర్పాటు అవసరమని తెలిపింది. రాజ్యాంగ పరమైన రక్షణలు ఉన్నప్పటికీ అసమానత, వివక్షకు గురవుతున్నామన్న భావన మైనారిటీల్లో ఉన్నందున రాజ్యాంగంలోని 46వ అధికరణానికి అనుగుణంగా ఈ గుర్తింపు ఇస్తే మంచిదని పేర్కొంది. ఈ మేరకు 40 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది.

మైనారిటీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నీరజ్‌ శంకర్‌ సక్సేనా, మరో అయిదుగురు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనివల్ల మెజార్టీ మతంలో జన్మించి నష్టపోతున్నామన్న భావన హిందువుల్లో కలుగుతోందని అభిప్రాయపడ్డారు. మతప్రాతిపదికన సంక్షేమ పథకాలను అమలు చేయకూడదని కోరారు. దీనికి సమాధానంగానే ఎన్‌సీఎం ప్రమాణ పత్రాన్ని సమర్పించింది.

సమాజంలో మైనారిటీలను సమ్మిళితం చేయడానికే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొంది. మైనారిటీల కోసం పథకాల అమలు చట్టవ్యతిరేకమేమీ కాదని కేంద్ర ప్రభుత్వం తన ప్రమాణ పత్రంలో తెలిపింది. అసమానతలు తగ్గించడానికే వీటిని అమలు చేస్తున్నామని, దీనివల్ల హిందువుల హక్కులను నష్టం జరగడం లేదని స్పష్టం చేసింది. మైనార్టీల్లోని బాగా వెనుకబడిన వారి కోసమే వీటిని అమలు చేస్తున్నందున తప్పుపట్టాల్సిందేమీ లేదని వివరించింది.

ఇదీ చూడండి: సుప్రీంకోర్టు చురుకైన పాత్ర.. పౌర హక్కులకు రక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.