student beaten up by teacher: బిహార్‌లో ఓ ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని చావుదెబ్బలు కొట్టాడు. ఉపాధ్యాయుడి దెబ్బలకు బాలుడి చర్మం కమిలిపోయింది. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. బేతియా జిల్లాలోని చంపాటియా బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది.
![student beaten up by teacher](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14716369_vlcsnap-2022-03-12-22h39m05s426-1.jpg)
Teacher beating Student Bihar
స్థానిక స్కూల్లో పనిచేసే రాజేశ్ కుమార్ రాయ్ అనే ఉపాధ్యాయుడే విద్యార్థిపై కర్కశంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలకు వెళ్లి అతడితో గొడవపెట్టుకున్నారు. అయితే, స్కూల్‌కు వెళ్లిన తల్లిదండ్రులతోనూ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. బాలుడి తండ్రి షర్ట్ కాలర్ పట్టుకొని ఘర్షణకు దిగాడు.
![student beaten up by teacher](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14716369_vlcsnap-2022-03-12-22h39m05s426-2.jpg)
తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధిత విద్యార్థి అజిత్ కుమార్.. స్కూల్లో తన స్నేహితుడితో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థి టాయిలెట్లో దాక్కున్నాడు. దీంతో సరదాగా టాయిలెట్ తలుపును అజిత్ మూసేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు.. అజిత్‌ను తీవ్రంగా కొట్టాడు. దీనిపై స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఘటన తర్వాత.. నిందితుడు పారిపోయాడు. ఫోన్‌ను సైతం స్విచ్ఛాఫ్ చేశాడు. బాలుడి కుటుంబ సభ్యులు ముఫాసిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని వెతికి పట్టుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయుడు తమ అధీనంలోనే ఉన్నాడని.. పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: హోలీ తర్వాతే యోగి ప్రమాణస్వీకారం- గవర్నర్‌ను కలిసిన 'మాన్'