ETV Bharat / bharat

శరీరమంతా విషం.. ప్రాణాపాయంలో తల్లి.. బాలుడి చాకచక్యంతో... - తల్లిని రక్షించిన బాలుడు

Minor Saves Mother: శరీరం విషపూరితమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని చాకచక్యంగా రక్షించాడు ఓ బాలుడు. ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్​ చేసి సమాచారం అందించాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.

Minor Saves Mother
విషం సోకి కొనఊపిరితో తల్లి
author img

By

Published : Apr 15, 2022, 12:57 PM IST

తల్లి ప్రాణాలు కాపాడిన కుమారుడు

Minor Saves Mother: ప్రాణాపాయంలో ఉన్న తల్లిని చాకచక్యంగా రక్షించాడు 11 ఏళ్ల బాలుడు. శరీరం విషపూరితమై ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్న ఆమె గురించి ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్​ చేసి సమాచారం అందించాడు. బాలుడి సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన హరియాణాలోని ధనీమహ్​తాబ్​ గ్రామంలో జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. బాధితురాలిని ఆ గ్రామానికి చెందిన సోమాదేవీగా పోలీసులు గుర్తించారు. ఆమెపై విషప్రయోగం జరిగిందా లేక ఆమె ఆత్మహత్యకు యత్నించిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఇదీ చూడండి : టీ ఇచ్చి టిఫిన్​ పెట్టలేదని.. కోడలిపై కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.