ETV Bharat / bharat

బాలికపై అత్యాచారం.. నోట్లో యాసిడ్ పోసి మరీ.. - దిల్లీ రేప్​ న్యూస్

Minor raped by factory manager: ఓ మైనర్​పై అత్యాచారం చేసి.. ఆపై బలవంతంగా నోట్లో యాసిడ్​ పోశాడు కిరాతకుడు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

Minor raped by factory manager
Minor raped by factory manager
author img

By

Published : Jul 17, 2022, 1:05 PM IST

Minor raped by factory manager: దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఓ మైనర్​పై అత్యాచారం చేసి.. ఆపై బలవంతంగా నోట్లో యాసిడ్​ పోశాడు కిరాతకుడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించామని.. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టకున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన దిల్లీ మహిళా కమిషన్​.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆదేశించింది. బాధితురాలి వాంగ్మూలం​ తక్షణమే తీసుకుని మెజిస్ట్రేట్​కు అందించాలని సూచించింది.

బాధితురాలి కుటుంబం రోజువారీ కూలీ చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే షూ పరిశ్రమలో పనిచేసేందుకు బాధితురాలు వెళ్లింది. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి నమ్మించిన మేనేజర్​ జై ప్రకాశ్​.. ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా బలవంతంగా నోట్లో యాసిడ్ పోశాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాధితురాలు..​ అపస్మారక స్థితిలోకి చేరుకుంది. దీంతో బాధితురాలిని ఎయిమ్స్​కు తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి:

అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం.. ఎక్కడంటే?

శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం.. ముస్లింలు సైతం భాగమై..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.