Minor leave husband: 45ఏళ్ల భర్తను వదిలి 22ఏళ్ల యువకుడితో వెళ్లిపోయింది ఓ 16 ఏళ్ల బాలిక. చిన్న వయసులోనే పెళ్లైన ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. దీంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కొన్ని నెలల పాటు గాలించి చివరకు ఆమెను పట్టుకున్నారు. అయితే స్టేషన్‌కు వచ్చిన ఆమె.. తన భర్తతో కలిసి ఉండే ప్రసక్తే లేదని, విడాకులు కావాలని చెబుతోంది. రాజస్థాన్ దౌల్పుర్లోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బాలికకు ఏడాది క్రితమే తల్లిదండ్రులు వివాహం చేశారని, అయితే ఈ పెళ్లి ఆమెకు ఇష్టం లేదని అధికారులు పేర్కొన్నారు. దంపతులకు ఓ పాప కూడా ఉందన్నారు. కానీ సమీప బంధువైన 22 ఏళ్ల యువకుడితో ఆమె ప్రేమలో పడిందని.. అందుకే ఇళ్లు విడిచి వెళ్లిపోయిందని చెప్పారు.
Dholpur news
మంగళవారం బాలికను స్టేషన్‌కు తీసుకొచ్చిన అనంతరం.. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల ముందు ప్రవేశపెట్టారు. వారు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత సఖీ కేంద్రంలో ఉంచారు. బాలిక విడాకులు కావాలంటుందని, తల్లిదండ్రల ఇంటికే వెళ్లి వారితోనే కలిసి ఉంటానని చెబుతోందని అధికారులు పేర్కొన్నారు. ఆమె తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడిన తర్వాత తల్లి, పాప ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Rajasthan minor news
25 సిమ్‌కార్డులు..
బాలిక గతేడాది అక్టోబర్‌లోనే ఇంటి నుంచి వెెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఫిర్యాదు చేసిన తర్వాత అనేక చోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదన్నారు. కొత్త సిమ్‌కార్డు తీసుకోవడం, కాసేపు మాట్లాడాక వాటిని విరిచేయడం వల్ల ఆమె ఎక్కడుందో కనిపెట్టలేకపోయామని పెర్కొన్నారు. ఇలా బాలిక 25 ఫోన్ నంబర్ల వరకు మార్చినట్లు వెల్లడించారు. అయితే చివరకు ఓ ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారంలో బాలిక ఎక్కడుందో తెలిసిందన్నారు.
ఇదీ చదవండి: అలా చెప్పి ఇంటికి తీసుకెళ్లి.. యువతిపై గ్యాంగ్‌రేప్!