Minor Girl Rape: హరియాణాలో దారుణం జరిగింది. అరేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన హరియాణాలోని పానీపత్‌లో ఆదివారం జరిగింది.
ఇదీ జరిగింది..
పానీపత్ జిల్లాలోని తెహసిల్ క్యాంపు ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో వలస కూలీలు పని చేస్తున్నారు. తల్లిదండ్రులతో వచ్చిన బాలిక.. పరిశ్రమ ప్రాంగణంలో ఆడుకుంటుండగా.. అక్కడే పని చేస్తున్న నిందితుడు ఫ్యాక్టరీపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ వచ్చి.. కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పాంది. హుటాహుటిన ఆమెను పానీపత్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.
పానీపత్ ఎస్పీ పూజా వశిష్ఠ్ సివిల్ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: స్నేహితులతో కలిసి విద్యార్థినిపై జవాను గ్యాంగ్‌రేప్