ETV Bharat / bharat

ఏపీలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం - పోక్సో కేసు

Minor girl found gang raped: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన వ్యక్తితో పాటుగా అతడి స్నేహితుడు, మరో ఎనిమిది మంది బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటివరకూ ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిపంపు చర్యలు చేపట్టారు.

Minor girl found gang raped
Minor girl found gang raped
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 9:34 AM IST

Minor girl found gang raped: విశాఖ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవ మృగాల చేతిలో ఆ బాలిక నరకాన్ని చవిచూసింది. ఒడిశా రాష్ట్రం నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను, ఓ వ్యక్తి ప్రేమ పేరుతో వంచించాడు. ఆ ప్రియుడు తొలుత తన కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం తన మిత్రుడినీ ఉసిగొలిపాడు. అలా మరో ఎనిమిది మంది బాలికను రెండు రోజులపాటు లాడ్జిలో నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

స్నేహితుడ్ని రప్పించి: స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం, ఒడిశాకు చెందిన ఓ కుటుంబం, గత కొంత కాలంగా విశాఖ కంచరపాలెంలో నివాసం ఉంటోంది. ఆ ఇంట్లోని బాలిక రైల్వే న్యూకాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి చేస్తోంది. ఆ బాలికకు భువనేశ్వర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 18న ఆమెను ప్రియుడు ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తన స్నేహితుడ్ని రప్పించి అతనితో అఘాయిత్యానికి పురమాయించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఆర్కే బీచ్‌కు వెళ్లి రోదిస్తుండగా, పర్యాటకుల ఫొటోలు తీసే ఓ వ్యక్తి ఆమెను జగదాంబ కూడలి సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించాడు. అ వ్యక్తతో సహా తన స్నేహితులు మరో ఎనిమిది మంది రెండు రోజులపాటు బాలికపై అత్యాచారం చేశారు.
minor: ప్రేమించానంటూ 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..

పోక్సో చట్టం కింద కేసు నమోదు: ఈ ఘటనతో ఆ బాలిక భయాందోళనకు గురైంది. ఆ కామాందుల చెర నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లింది. అయితే, ఇంటినుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే ఆమె తల్లిదండ్రులు, తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక అదృశ్యం కేసు నమోదు చేసిన నాల్గో పట్టణ పోలీసులు, 22న ఆమెను గుర్తించారు. ఆ బాలికను విశాఖలోని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకూ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె తల్లిదండ్రులతో పంచుకోలేదు. ఎట్టకేలకు తాను పడ్డ బాధలను ఆదివారం ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై వారు పోలీసులను ఆశ్రయించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు నగరానికి చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేశారు. ఝార్ఖండ్‌, విశాఖ నగరాల్లో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Anantapur SP on gang rape case: మహిళపై అత్యాచారం ఆరోపణలపై... ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. కానీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.