Minor Girl Carried Father On Rickshaw in Odisha : గాయపడిన తండ్రిని రిక్షా తొక్కుతూ 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది 14 ఏళ్ల కుమార్తె. ఒడిశా.. భద్రక్ జిల్లాలో అక్టోబర్ 22న జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదీ జరిగింది..
జిల్లాలోని దుసూరి నడిగావ్ ప్రాంతానికి చెందిన శంభునాథ్ సేథి అనే వ్యక్తి అక్టోబర్ 22న గాయపడ్డాడు. వాహనంలో ఆస్పత్రికి వెళ్లడానికి డబ్బులు లేక.. అతడి 14 ఏళ్ల కుమార్తె శంభునాథ్ను రిక్షాపై ధామ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం అదే రిక్షాపై 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న భద్రక్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే శంభునాథ్కు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక రిక్షాలో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఆస్పత్రి నుంచి రెండు కిలో మీటర్లు ప్రయాణించాక.. బాలిక రిక్షా తొక్కడాన్ని కొందరు విలేకరులు గమనించారు. అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న భద్రక్ ఎమ్మెల్యే, ధామ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ఘటనా స్థలికి చేరుకుని.. బాధితుల పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం బాలిక తండ్రి చికిత్సకు, ఆస్పత్రిలో వారి బసకు ఏర్పాట్లు చేశారు.
బ్యాగులో కొడుకు మృతదేహం.. అంబులెన్స్‌కు డబ్బులు లేక..
ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఈ ఏడాది మేలో అంబులెన్స్‌లో కుమారుడి మృతదేహాన్ని తరలించేందుకు డబ్బులు లేక.. బ్యాగులో పెట్టి బస్సులో ఇంటికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి!. బంగాల్లోని ఉత్తర దినాజ్‌పుర్ జజిల్లాలోని కలియాగంజ్ బ్లాక్ ముస్తఫానగర్ పంచాయతీలోని దంగీపరా గ్రామానికి చెందిన అషిమ్ దేబ్ ఇద్దరు కుమారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిద్దరినీ కలియాగంజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడం వల్ల రాయ్‌గంజ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయతించినా చిన్నారుల ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో మెరుగైన చికిత్స కోసం శిలిగుడి బోధనాసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
అంబులెన్స్ లేక.. ద్విచక్ర వాహనం దిక్కాయె..
Relatives Carried Man Dead Body On Bike : బైక్‌పై మృతదేహంతో 10కిమీ ప్రయాణం