Minor Gave Birth To Died Baby : తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ మైనర్ 8 నెలల శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనపై బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది
చురు జిల్లాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆ మైనర్ 8 నెలల గర్భంతో ఉన్నట్లు గుర్తించారు. నొప్పి తీవ్రంగా ఉండడం వల్ల ఆమెకు ఆపరేషన్ నిర్వహించి చనిపోయిన బిడ్డను బయటకు తీశారు. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు, కుటుంబీకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, డీఎన్ఏ పరీక్షల కోసం మరణించిన నవజాత శిశువుకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, బాలిక గర్భం దాల్చడానికి గల కారణమైన వ్యక్తిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
"15 ఏళ్ల బాలిక 8 నెలల గర్భంతో ఆస్పత్రికి వచ్చినట్లు మాకు సమాచారం అందింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడం వల్ల బాధితురాలిని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు ఆమె తల్లి తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె కడుపులో నుంచి 8 నెలలు నిండిన శిశువు మృతదేహం బయటపడింది. డీఎన్ఏ పరీక్షల కోసం చిన్నారి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించాము. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం."
- అల్కా వైష్ణోయ్, దుధ్వాఖారా పోలీస్ స్టేషన్ ఆఫీసర్
మగ బిడ్డకు జన్మనిచ్చిన 14ఏళ్ల బాలిక
Girl Delivers A Baby Boy : ఇటీవల కర్ణాటకలో తుమకూరులో కూడా ఇలాంటి షాకింగ్ ఘటనే వెలుగు చూసింది. వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. ఈ కథనం పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
కునో జాతీయ పార్కులో మరో చీతా మృతి- 10కి చేరిన మరణాలు
బతికుండగానే పెద్ద కర్మ- పత్రికలతో ఆహ్వానించి చావు భోజనం- కారణం అదే!