ETV Bharat / bharat

పోలీసుల లాఠీఛార్జ్​- బాలుడు మృతి! - ఉత్తర్ ప్రదేశ్

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ బాలుడి మృతి కలకలం సృష్టిస్తోంది. కొవిడ్ కర్ఫ్యూ అతిక్రమించాడని, అతడిని పోలీసులు చితకబాదినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Minor dies after police thrashing for violating Covid-19 curfew in UP
యూపీలో పోలీసు దెబ్బలకు మైనర్ మృతి
author img

By

Published : May 22, 2021, 2:26 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్ జిల్లాలో కరోనా కర్ఫ్యూ ఉల్లంఘించాడని పోలీసులు ఓ బాలుడిని చితకబాదారు. మరుసటి రోజునే ఆ బాలుడు మృతి చెందటం కలకలం సృష్టిస్తోంది. పోలీసుల దెబ్బలకే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఓ కానిస్టేబుల్​ను సస్పెండ్ చేసిన అధికారులు, మరో హోం గార్డును విధుల నుంచి తొలగించారు.

ఠాణాకు తీసుకెళ్లి మరీ..

బంగార్ మావ్​లోని తన ఇంటి బయట బాలుడు కూరగాయాలు విక్రయిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. "కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించాడనే ఆరోపణలపై అతడిని పోలీసులు లాఠీతో కొట్టారు. అనంతరం పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లి మరోసారి చితకబాదారు. దీంతో అతడి పరిస్థితి విషమించింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధరించారు" అని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పోలీసుల చర్యపై ఆగ్రహించిన స్థానికులు లఖ్​నవూ రోడ్ క్రాసింగ్ వద్ద ఆందోళన చేపట్టారు. దోషులను వెంటనే శిక్షించాలని, బాధిత కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం సహా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి, సంబంధిత పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: మతి పోగొట్టే మానవత్వం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.