ఉత్తర్ప్రదేశ్ హమిర్పుర్ జిల్లాలో దారుణం జరిగింది. మేన కోడలైన ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మైనర్. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హమిర్పుర్ జిల్లాలోని కొత్వాలి ఠాణా పరిధిలో ఉండే బాలిక.. తన ఇంటి వద్ద ఆడుకుంటోంది. అది గమనించిన 16ఏళ్ల బాలుడు బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడు వరసకు మామ అవుతాడు. అనంతరం ఏడుస్తూ వెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం.
నరేంద్ర కుమార్ సింగ్, హమిర్పుర్ ఎస్పీ.
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. మైనర్ ఆత్మహత్య