minor boy raped minor girl: ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు 12ఏళ్ల బాలుడు. మామిడి పండ్లు ఇస్తానని బాలికను ప్రలోభపెట్టి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పుర్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చైల్డ్‌లైన్ అధికారుల సహాయంతో బాలుడిని విచారిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ తరగతులకు హాజరవుతూ.. పోర్న్ వీడియోలు చూడడమే దీనికి కారణామని అధికారులు అనుమానిస్తున్నారు.
బాలుడి ఇంటికి సమీపంలో నివసించే ఏడేళ్ల బాలిక.. ఇంటి సమీపంలోని చెట్టుకు మామిడి పండ్లు కోయడానికి ప్రయత్నించింది. ఇది గమనించిన బాలుడు తాను ఇస్తానంటూ బాలికను నమ్మబలికాడు. తనతో పాటు చిన్నారిని ఇంటి వెనుక ఉన్న పశువుల కొట్టానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత బాలిక ఏడుస్తూ ఇంటికి పరుగెత్తింది. బాలిక ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. బాలికను పరిశీలించిన వైద్యులు.. అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య