Minister Sabitha Indra Reddy Gunman Commit Suicide : హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) గన్‌మెన్ ఫజల్ అలీ బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమార్తె కళ్లెదుటే నుదుటిపై గన్ పెట్టుకుని పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అమీర్‌పేట శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ వద్ద చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం ఆయన విధులకు వెళ్తూ కుమార్తెను వెంట తీసుకెళ్లారు. హోటల్ వద్ద కుమార్తెతో వ్యక్తిగత విషయాలు చర్చించారు. ఈ క్రమంలోనే గన్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.
ఉరివేసుకుని భార్య.. రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం
ASI Suicide in Hyderabad Today : దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫజల్ అలీ ఆత్మహత్యకు (Commit Suicide) గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఫజల్ అలీ ఓ ప్రైవేట్ బ్యాంకులో రుణం తీసుకున్నట్లు ఆయన కుమార్తె తెలిపారు. రుణం చెల్లించినా అదనంగా డబ్బులు కోరుతున్నారని నాన్న ఆవేదన చెందేవారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు గన్‌మెన్ మృతికి కారణం ఆర్థిక ఇబ్బందులా? లేక కుటుంబ కలహాలా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Wife And Husband Suicide In Medak : కుటుంబ కలహాలతో భార్య.. కాపాడపోయి భర్త..
ఉదయం 7 గంటల సమయంలో ఫజల్ అలీ ఆత్మహత్య చేసుకున్నట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ (Joel Davis) తెలిపారు. ఉదయం కుమార్తెతో కలిసి ఫజల్ అలీ విధులకు వచ్చారని చెప్పారు. వ్యక్తిగత విషయాల గురించి ఆమెతో చర్చించారని అన్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఇంఛార్జ్‌గా ఫజల్ అలీ విధులు నిర్వహిస్తున్నారని జోయల్ డేవిస్ వెల్లడించారు.
ఉదయం 7 గంటల సమయంలో ఫజల్ అలీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమార్తెతో కలిసి ఫజల్ అలీ విధులకు వచ్చారు. వ్యక్తిగత విషయాల గురించి కుమార్తెతో చర్చించారు. అనంతరం ఆమె కళ్లెదుటే గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఇన్‌ఛార్జిగా ఫజల్ అలీ ఉన్నారు. - జోయల్ డేవిస్, పశ్చిమ మండల డీసీపీ