Minister of State Bachchu Kadu: మహారాష్ట్ర మంత్రి బచ్చు కడూకు రెండు నెలల కఠినకారాగార శిక్ష విధించింది స్థానిక కోర్టు. అంతేకాక రూ. 25వేలు జరిమానా విధించింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముంబయిలో తనకున్న ఫ్లాట్ వివరాలను అఫిడవిట్లో పొందుపరచనందుకు చందూర్బజార్లోని ఫస్ట్‌క్లాస్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
ఈ మేరకు భాజపా కార్పొరేటర్ గోపాల్ తిరమరే 2017లో అసేగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
"2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముంబయిలోని ఓ ఫ్లాట్ కొనుగోలు కోసం లోన్ తీసుకున్నాను. అయితే లోన్ వివరాలను అఫిడవిట్లో పెట్టాను. కానీ హౌస్ నంబర్ వేయడం మర్చిపోయా. అది సీరియస్ విషయం కాదు. కోర్టు ఇచ్చిన తప్పుడు తీర్పును స్వాగతిస్తున్నా." అని కోర్టు తీర్పుపై బచ్చు కడూ స్పందించారు.
ఇదీ చూడండి: యువకుడి కిరాతకం.. ప్రేయసిపై కత్తితో దాడి.. పెళ్లికి కొద్దిరోజుల ముందే...