ETV Bharat / bharat

ప్రభుత్వరంగ నవరత్నాలను.. మోదీ ఇద్దరు ఇష్టరత్నాలకు కట్టబెట్టే కుట్ర: కేటీఆర్‌

KTR Comments on Vishaka Steel Plant : తెలుగు రాష్ట్రాలపై ప్రధాని మోదీ చేస్తున్న కుట్రను ఎండగట్టేందుకు తాము కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అదానీ కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. నష్టాలు చూపించి చౌకగా దోస్తులకు విక్రయించటం మోదీ విధానమన్న ఆయన.. విశాఖ ఉక్కు పరిశ్రమను కావాలనే నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రాజకీయాల కోసమే విశాఖ స్టీల్‌ ప్లాంట్ టేక్ ఓవర్‌ అనేది అవాస్తవమని మంత్రి వెల్లడించారు.

KTR Comments on Vishaka Steel Plant
KTR Comments on Vishaka Steel Plant
author img

By

Published : Apr 11, 2023, 1:24 PM IST

Updated : Apr 11, 2023, 8:06 PM IST

ప్రభుత్వరంగ నవరత్నాలను.. మోదీ ఇద్దరు ఇష్టరత్నాలకు కట్టబెట్టే కుట్ర: కేటీఆర్‌

KTR Comments on Vishaka Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోసం బిడ్డింగ్‌, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదానీ కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. 2018 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్‌ బైలదిల్లా ఐరన్‌ఓర్‌ కంపెనీ పెట్టిందన్న ఆయన.. అక్కడి నుంచి గుజరాత్‌లోని ముంద్రాకు తరలించేలా ప్రణాళిక చేశారని తెలిపారు. ఈ కేటాయింపు ద్వారా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు లేకుండా... విశాఖ ఉక్కును లేకుండా చేయాలనే కుట్ర దాగి ఉందని ఆరోపించారు.

నష్టాలు జాతికి అంకితం.. లాభాలు దోస్తులకు ఇవ్వటం : విశాఖ ఉక్కు పరిశ్రమను కావాలనే నష్టాల్లోకి నెట్టారన్న కేటీఆర్‌.. నష్టాలు చూపించి చౌకగా తన మిత్రులకు విక్రయించటం మోదీ విధానమని విమర్శించారు. ప్రధాని అదానీ కలిసి తెలుగు రాష్ట్రాల సంపదను కొల్లగొడుతున్నారని నిర్దిష్ఠమైన ఆధారాలతో చేస్తున్న ఈ ఆరోపణ తప్పని నిరూపిస్తే... పరువునష్టం దావా ఎదుర్కొనేందుకైనా సిద్ధమని కేటీఆర్‌ సవాల్ విసిరారు. బైలాదిల్లాలో 1.34 బిలియన్‌ టన్నుల ఐరన్ ఓర్‌ లభిస్తుందన్న కేటీఆర్... అక్కడి నుంచి బయ్యారానికి 50శాతం పైపులైన్‌ ఖర్చు భరిస్తామని చెప్పినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. బయ్యారంలో పరిశ్రమ సాధ్యం కాదంటూ తిరస్కరించారని విమర్శించారు. నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను దోస్తులకు అంకితం చేయటం మోదీ విధానమని విమర్శించారు. రాజకీయాల కోసమే విశాఖ స్టీల్‌ ప్లాంట్ టేక్ ఓవర్‌ అనేది అవాస్తవమని స్పష్టం చేశారు.

''బైలదిల్లా అనేది 1.34 బిలియన్‌ టన్నుల ఐరన్ ఓర్‌ లభించే గని. విశాఖ ఉక్కుకు, బయ్యారం గనులకు ఒక సంబంధం ఉంది. బైలదిల్లా గని బయ్యారానికి 160 కి.మీ. దూరంలోనే ఉంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలోనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు పెడతామని కేంద్రం చెప్పింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రధానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. బైలదిల్లా నుంచి బయ్యారానికి 50 శాతం పైపులైన్‌ ఖర్చు భరిస్తామని చెప్పాం. బయ్యారంలో పరిశ్రమ పెడితే ఫీజబులిటీ కాదని తిరస్కరించారు.'' -కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి

నిజాం షుగర్స్‌ పునరుద్ధరణకు సిద్ధం : రైతుల సహకార సంఘంగా ఏర్పడితే నిజాం షుగర్స్‌ పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని కేటీఆర్ తెలిపారు. ఇందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు బతికుంటేనే జాతికి మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తి కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వరంగ సంస్థల సంరక్షణపై ఏపీ వైఖరిపై మాకు ఆసక్తి లేదన్న కేటీఆర్‌... కేంద్రం ఏం చేస్తుందనేదే ముఖ్యమని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

Last Updated : Apr 11, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.