కర్ణాటకలో రెండోదశ కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ.. ఆక్సిజన్, పడకల కోసం అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. సమయానికి బెడ్లు, ప్రాణవాయువు లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అపార్ట్మెంట్ వాసులు అప్రమత్తమై.. తమ నివాస భవనంలోనే మినీ కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
![Mini Covid care center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bng-09-covid-care-cener-apartment-7202806_06052021164408_0605f_1620299648_693_0605newsroom_1620307558_1011.jpg)
యశ్వంత్పుర్లోని గోల్డెన్ గ్రాండ్ అపార్ట్‌మెంట్స్‌లో.. ఆక్సిజన్, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా 5 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్‌ను రూపొందించారు. ఆ అపార్ట్మెంట్లో మొత్తం 40మందికిపైగా వైద్యులు ఉన్నారు. వీరంతా తమ ఖాళీ సమయాల్లో ఈ కరోనా కేంద్రంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, రోగులను పర్యవేక్షిస్తున్నారు.
మొత్తం 520 ఫ్లాట్స్ ఉన్న గోల్డెన్ గ్రాండ్లో ఇప్పటివరకు సుమారు 20 ఫ్లాట్లకు చెందినవారు కరోనా బారినపడ్డారు.
ఇదీ చదవండి: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి: సుప్రీం కోర్టు