ETV Bharat / bharat

ఆచితూచి అడుగులు వేస్తున్న మజ్లిస్ పార్టీ - కంచుకోట పాతబస్తీపై పట్టు కొనసాగించేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 6:23 AM IST

MIM Asaduddin Owaisi Election Campaign in Telangana: హైదరాబాద్‌ పాతబస్తీని కంచుకోటగా మార్చుకున్న ఎంఐఎం.. ఈసారి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించిన మజ్లిస్‌.. వ్యతిరేకత ఉన్న నాంపల్లి ఎమ్మెల్యేకు స్థానచలనం కల్పించింది. అన్నీతానై ప్రచారం చేస్తున్న మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ.. పతంగి పార్టీ ప్రాభవాన్ని కొనసాగించాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు.

Telangana Assembly Election 2023
MIM Party Election Campaign in Telangana

పాతబస్తీపై పట్టు సడిలించకూడదనే పట్టుదలతో మజ్లిస్‌ - ఈసారి పతంగి హవా కలిసొచ్చేనా!

MIM Asaduddin Owaisi Election Campaign in Telangana : హైదరాబాద్‌ పాతబస్తీపై.. పతంగి పార్టీకి గట్టి పట్టు ఉంది. మజ్లిస్‌కు ఏడు స్థానాలు వదిలేసి మిగతా సీట్లపై ప్రధాన పార్టీలు దృష్టి పెడతాయంటే.. అతిశయోక్తి కాదు. బరిలో నిలిచేందుకు అభ్యర్థులు ఉంటే చాలు అని భావిస్తాయి. పాతబస్తీలో వేరే పార్టీల ఉనికిని సైతం మజ్లిస్‌ సహించదు. పతంగి పార్టీ వాళ్లు.. ఇతర పార్టీల కార్యకర్తలపై దాడులు(Activists Attacks) దిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. పాతబస్తీపై పట్టు సడిలించకూడదనే పట్టుదలతో మజ్లిస్‌.. ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగింది. సిట్టింగ్ స్థానాలైన చార్మినార్, చంద్రాయణ్‌గుట్ట, బహదూర్‌పుర, మలక్‌పేట్, యాకుత్‌పుర, కార్వాన్, నాంపల్లితోపాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌లోనూ పోటీ చేస్తోంది.

హైదరాబాద్‌పై ఈసారి పట్టు ఎవరిదో? సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు

మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ... ఈసారి అచితూచి అభ్యర్థుల ఎంపిక చేశారు. ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చారు. వ్యతిరేకత ఉన్న నాంపల్లి ఎమ్మెల్యేకు స్థానచలనం కల్పించారు. చంద్రాయణ్‌గుట్ట నుంచి అక్బరుద్దీన్, కార్వాన్-ఖౌసర్ మొయినోద్దీన్, మలక్‌పేట్‌-అహ్మద్ బలాలకు మరోసారి అవకాశం ఇచ్చారు. చార్మినార్(Charminar), బహదూర్‌పుర, యాకత్‌పురలో సిట్టింగ్‌లకు టిక్కెట్‌ ఇవ్వలేదు. యాకుత్‌పురలో సిట్టింగ్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి అనారోగ్య కారణాల రీత్యా తప్పుకోగా.. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మీరాజ్ జాఫర్‌ హుస్సేన్‌ను బరిలోకి దింపారు.

MIM Party Election Campaign in Hyderabad : నాంపల్లి నుంచి మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు. రాజేంద్రనగర్ నుంచి స్వామి యాదవ్‌, జూబ్లిహిల్స్ నుంచి షేక్‌పేట్ కార్పొరేటర్ రషీద్‌ను బరిలోకి దించారు. చార్మినార్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌ను తప్పించి.. మాజీ మేయర్ మీర్ జుల్ఫికర్ అలీకి అవకాశం ఇచ్చారు. తన కుమారుడికి టిక్కెట్‌ ఇవ్వాలని ముంతాజ్‌ ఖాన్‌ అడిగినా.. మజ్లిస్‌ నిరాకరించింది. ఎంఐఎంపై అసంతృప్తితో ముంతాజ్‌ఖాన్‌.. కాంగ్రెస్‌, ఎంబీటీ నుంచి పోటీ చేస్తారని భావించారు.

MIM Meeting in Zahirabad : మామను గెలిపించండి.. పవర్​ ప్లేలో మా తడాఖా చూపిస్తాం : అసదుద్దీన్​ ఓవైసీ

ఏ పార్టీ నుంచి నామినేషన్‌ వేయని ఆయన.. ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థికి.. ముంతాజ్‌ఖాన్‌ మద్దతు తెలుపుతారా లేదా అనేది సందేహంగానే ఉంది. బహదూర్‌పుర సిట్టింగ్ ఎమ్మెల్యే(Sitting MLA) మౌజంఖాన్‌ను పక్కనపెట్టిన మజ్లిస్‌.. ఆయన స్థానంలో శాస్త్రిపురం కార్పొరేటర్ మహ్మద్‌ ముబీన్‌కు టికెట్‌ కేటాయించింది. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మౌజంఖాన్‌కు టిక్కెట్‌ దక్కకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నారు. ఈయన కుమారుడు జూబ్లీహిల్స్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన సమయంలో మజ్లిస్‌ పేరు వార్తల్లో నిలిచింది. ఈ కారణంగానే మౌజంఖాన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Hyderabad Political News : నాంపల్లిలో మజ్లిస్‌కు కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. స్థానిక సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నిసార్లు గెలించినా సమస్యలు పరిష్కారం కావడం లేదనే భావన స్థానికుల్లో నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీరాజ్ జాఫర్‌ హుస్సేన్‌ను యాకత్‌పురకు పంపి.. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్‌ను నాంపల్లి నుంచి పోటీ చేయిస్తున్నారు. యాకత్‌పురలో ఎంఐఎంతో.. ఎంబీటీ అభ్యర్థి(MBT Candidate) అంజదుల్లా ఖాన్ హోరాహోరీ తలపడుతున్నారు.

స్థానికంగా అందుబాటులో ఉండే అంజాదుల్లా... ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తూ ప్రజలకు చేరవయ్యారు. ఏడు స్థానాల్లో మళ్లీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ.. సభలు, సమావేశాలతోపాటు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మజ్లిస్‌ అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తూ క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు.

'మజ్లిస్‌తో కలిసి రా కేసీఆర్... బల ప్రదర్శనకు భాజపా సిద్ధం'

MP Asaduddin on Telangana Elections : ఈసారి ఎన్నికల్లో కూడా కేసీఆర్​దే విజయం: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.