ETV Bharat / bharat

భద్రతా బలగాలపై ముష్కరుల గ్రనేడ్​ దాడి - పంజాబ్​లో గ్రనేడ్​ బాంబు

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు గ్రనేడ్​ దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. నిందితుల కోసం సోదాలు చేపట్టారు. మరోవైపు.. పంజాబ్​ అమృత్​సర్​లో ఓ గ్రనేడ్​ కనిపించడం కలకలం రేపింది.

Militants lob grenade
గ్రనేడ్​ దాడి
author img

By

Published : Aug 13, 2021, 4:17 PM IST

జమ్ముకశ్మీర్​, బారాముల్లా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై గ్రనేడ్​ విసిరారు.

శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సోపోర్​లోని ఎస్​బీఐ మెయిన్​ చౌక్​ ​ ప్రాంతంలో ఈ దాడి జరిగిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.

అయితే.. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దాడి అనంతరం ఘటనాస్థలిలో భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.

పంజాబ్​లో గ్రనేడ్​ కలకలం

పంజాబ్​ అమృత్​సర్​లోని పాశ్​ ప్రాంతంలో ఓ గ్రనేడ్​ తరహా బాంబు కనిపించడం కలకలం రేపింది. పారిశుద్ధ్య కార్మికులు దీన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఘటనాస్థలికి పోలీసులు, బాంబు నిర్వీర్యం చేసే సిబ్బంది చేరుకున్నారు.

grenade in punjab
గ్రనేడ్​ బాంబు కనిపించిన స్థలంలో పోలీసులు
grenade in punjab amritsar
ఘటనాస్థలిలో యాంటీ బాంబు స్క్వాడ్​ సిబ్బంది
hand grenade like bomb in punjab
బాంబును వాహనంలో తరలిస్తున్న పంజాబ్​ పోలీసులు

నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆ బాంబును నిర్వీర్యం చేసినట్లు అధికారులు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఉగ్రవాది హతం

ఇదీ చూడండి: భాజపా నేత ఇంట్లో పేలుడు- ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.