ETV Bharat / bharat

Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది​ హతం

జమ్ముకశ్మీర్​లో (Kashmir Encounter) గురువారం ఉదయం జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాది​ హతమయ్యాడు. ఈ ఘటనలో ఓ స్థానికుడు గాయపడ్డట్లు పోలీసులు వెల్లడించారు.

Kashmir Encounter
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Sep 23, 2021, 10:41 AM IST

జమ్ముకశ్మీర్​లో షోపియన్ జిల్లా (Kashmir Encounter) కష్వా గ్రామంలో ముష్కరులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో (Encounter in Kashmir Today) సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

స్థానికుడికి గాయాలు..

కష్వాలో ఉగ్రవాది ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి గాలింపు చర్యల్లో మిలిటెంట్​ను గుర్తించామని.. లొంగిపోయేందుకు అవకాశం కల్పించినా తమపై కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ స్థానికుడు గాయపడ్డాడని తెలిపారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రవాది మృతిచెందినట్లు (Militants Killed in Kashmir) స్పష్టం చేశారు. ముష్కరుడు.. అనాయర్​ ఆష్రఫ్​ దార్​గా గుర్తించినట్లు వెల్లడించారు. నిందితుడిపైన ఇప్పటికే డ్రగ్స్​ రవాణా సహా తీవ్రవాదులకు ఆయుధాలు పంపిణీ చేస్తున్నట్లు కేసులు నమోదయ్యాయని తెలపారు.

ఇదీ చూడండి : స్వాతంత్య్రోద్యమంలో మనవారిని 'నిద్ర' లేపిన చాయ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.