జమ్ముకశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా వాంగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు.
ఈ ఘటనలో ఓ సైనికుడు అమరుడయ్యాడు. మరో జవాను గాయపడ్డాడు. గాయపడ్డ సైనికుడిని అధికారులు.. ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:లేడీ సింగమ్ ఆత్మహత్య కేసులో అధికారి అరెస్టు