ETV Bharat / bharat

అర్ధరాత్రి పరుగుతో సంచలనం- సాయం చేస్తామని ఎందరో ముందుకు.. - vinod kapri

Midnight Running Teen Pradeep: ప్రదీప్​ మెహ్రా గుర్తున్నాడుగా. తను పని చేసే మెక్​డొనాల్డ్స్​ నుంచి 10 కి.మీ. దూరంలోని ఇంటికి అర్ధరాత్రి పరిగెత్తుతూ పాపులర్​గా మారాడు. డైరెక్టర్​ వినోద్​ కాప్డీ షేర్​ చేసిన వీడియోతో అతడు లక్షల మందికి చేరువయ్యాడు. తన కథతో.. ప్రజల హృదయాల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతడికి సాయం చేసేందుకు ఎందరో ముందుకువస్తున్నారు. నొయిడా కలెక్టర్​ కూడా ఆ కుర్రాడితో మాట్లాడి సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Midnight running teen sensation Pradeep Mehra

author img

By

Published : Mar 23, 2022, 5:41 PM IST

Midnight Running Teen Pradeep: అర్ధరాత్రి పరుగుతో సోషల్​ మీడియాలో సంచలనంగా మారిన ఆ యువకుడి భవిత మారబోతుంది. ప్రముఖ డైరెక్టర్​ వినోద్​ కాప్డీ షేర్​ చేసిన వీడియోపై పలువురు స్పందిస్తున్నారు. ప్రదీప్​ మెహ్రాకు తోడ్పాటు అందించడానికి సిద్ధమంటున్నారు. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ నొయిడా కలెక్టర్​ కూడా ముందుకొచ్చారు. తన తల్లికి వైద్యం తగిన ఆర్థిక సాయం సహా ఆర్మీలో చేరేందుకు శిక్షణ ఇప్పిస్తానని కలెక్టర్​ హామీ ఇచ్చినట్లు మెహ్రా మీడియాకు తెలిపారు.

Midnight running teen sensation Pradeep Mehra
ఏఎన్​ఐతో మాట్లాడుతున్న ప్రదీప్​ మెహ్రా

''నేను ఈరోజు నొయిడా జిల్లా కలెక్టర్​ను కలిశా. మా అమ్మకు చికిత్స సహా ఆర్థిక సాయం, ఆర్మీలో చేరేందుకు శిక్షణ ఇప్పిస్తానని నాకు చెప్పారు. ప్రస్తుతానికి మెక్​డొనాల్డ్స్​లో నా పని కొనసాగిస్తా. ఇప్పుడు శిక్షణ కోసం నాకు ఎక్కువ సమయం దొరుకుతుంది. అందరూ సాయం చేస్తామని ముందుకు వస్తుండటం నాకు సంతోషంగా ఉంది.''

- ప్రదీప్​ మెహ్రా

ప్రదీప్​ కెరీర్​ను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అన్నివిధాలా సహకరిస్తానని అంటున్నారు నొయిడా కలెక్టర్​ సుహాస్​. ఏం కావాలో ఎంచుకోవాలని అతడిని అడిగినట్లు చెప్పారు. ప్రదీప్​ మెహ్రా ఎందరికో ప్రేరణ కలిగిస్తున్నాడని, తాను కూడా అతడికి పెద్ద అభిమానిగా మారినట్లు చెప్పారు. 'ప్రదీప్​ తల్లికి చికిత్స కోసం మేం ఇప్పటికే నొయిడా మెడికల్​ కాలేజీతో మాట్లాడాం. కానీ.. ఎక్కడ చికిత్స అందించాలనేది ప్రదీప్​ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఏం కావాలో, ఏం చేయాలనుకుంటున్నాడో అన్నీ అడిగా' అని కలెక్టర్​ సుహాస్​ పేర్కొన్నారు.

ఇదీ జరిగింది.. ప్రముఖ డైరెక్టర్ వినోద్ కాప్డీ.. ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశారు. అందులో నొయిడా రహదారిపై తన కార్​లో వెళ్తుండగా.. ఓ యువకుడు రోడ్డుపై పరిగెత్తుతూ కనిపిస్తాడు. ఎందుకు పరిగెడుతున్నావ్? అని యువకుడిని అడుగుతాడు. లిఫ్ట్ ఇస్తానంటే సున్నితంగా తిరస్కరిస్తాడు. వీటితో పాటు పలు ప్రశ్నలకు యువకుడు చెప్పిన సమాధానాలు విని.. 'నువ్వో బంగారం' అంటూ యువకుడిని డైరెక్టర్ మెచ్చుకుంటాడు. దీంతో పాటు మరికొన్ని ప్రశ్నలకు ఆ యువకుడు చెప్పిన సమాధానాలు విని.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ విని.. పలువురు అతడని అభినందిస్తున్నారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లక్షల మందికి స్ఫూర్తిని ఇచ్చే ప్రదీప్​ మెహ్రా రన్నింగ్​ వీడియో.. సోషల్​ మీడియాలో విస్తృతంగా వైరల్​ అవుతోంది. అతని కథ విన్న వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. దృఢ నిశ్చయంతో ఆర్మీలో చేరాలన్న లక్ష్యం కోసం పరితపిస్తుండటం చూసి సెల్యూట్​ చేస్తున్నారు. విజేతలు ఇలాగే తయారవుతారంటూ మాజీ క్రికెటర్​ హర్భజన్​ సింగ్​ ట్వీట్​ చేశారు. ఇంగ్లాండ్​ ఆటగాడు కెవిన్​ పీటర్సన్​ కూడా సంబంధిత వీడియోను పోస్ట్​ చేశాడు. ప్రదీప్​ దేశానికి కాబోయే హీరో అంటూ మధ్యప్రదేశ్​ పన్నా కలెక్టర్​ సంజయ్​ కుమార్​ మిశ్రా ప్రశంసించారు. ప్రదీప్​కు అభినందనలు అంటూ సినీ నటి కాజల్​ అగర్వాల్​ ట్వీట్​ చేశారు. ప్రదీప్​ కథ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని అతని వీడియోను సోషల్​ మీడియాలో షేర్​ చేశారు హీరో సాయిధరమ్​ తేజ్​. ఇంకా ఎందరో రాజకీయ, వ్యాపార, సినీరంగానికి చెందిన ప్రముఖులు దీనిపై కామెంట్లు చేస్తున్నారు.

స్థానిక రిపోర్టర్​తో ప్రదీప్​ మెహ్రా తండ్రి త్రిలోక్​ సింగ్​

ప్రదీప్​ మెహ్రా స్వస్థలం ఉత్తరాఖండ్​ అల్మోరా జిల్లాలోని చౌఖుటియాలోని ఢనాండ్​. ఈటీవీ భారత్ రిపోర్టర్​ అతడి ఇంటికి వెళ్లి పరిశీలించగా వారు చాలా పేదరికంలో ఉన్నట్లు తెలిసింది. ప్రదీప్​ మెహ్రా తండ్రి త్రిలోక్​ సింగ్​ అక్కడే.. ఇందిరా ఆవాస్​ యోజన కింద వచ్చిన చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇక్కడి కొండ ప్రాంతంలో ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం, పశుపోషణ. తమకు ఇవేమీ లేవని త్రిలోక్​ సింగ్​ చెప్పారు. అందుకే కుమారులు ఇద్దరూ నొయిడాలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారని తెలిపారు.

ఇవీ చూడండి: మహిళ మెడలో గొలుసు కొట్టేస్తూ దొరికిన 'మిస్టర్ ఇండియా'!

భుజాలపై కుమారుడి శవం.. గుండె నిండా దుఃఖం.. అర కిలోమీటరు నడుస్తూ...

కష్టాలను ఎదిరించిన సరస్వతీ పుత్రులు.. ఇద్దరికే 23 గోల్డ్ మెడల్స్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.