దేశంలో లాక్‌డౌన్ మార్గదర్శకాలను మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది నవంబర్‌లో విడుదల చేసిన మార్గదర్శకాలే ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.
హోంశాఖ తాజా మార్గదర్శకాలివే..
- సినిమా హాళ్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చు. దీనిపై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేస్తోంది.
- స్విమ్మింగ్ పూళ్లలో అందరికీ అనుమతి ఉంటుంది.
- అంతర్రాష్ట్ర ప్రయాణాలు, రాష్ట్రం లోపల వేర్వేరు ప్రాంతాలకు చేసే ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇందుకు ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు అవసరం లేదు
- కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని రకాల కార్యక్రమాలకు అనుమతి.
- సామాజిక, మతపర, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక ప్రాంతాల్లో ఇప్పటికే 50 శాతం లేదా 200కు మించకుండా ఇచ్చిన అనుమతులు సడలింపు
- అన్ని రకాల ఎగ్జిబిషన్ హాళ్లకు అనుమతి.
అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై పౌర విమానయాన శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: త్వరలో భారత్ చేతికి మరో మూడు రఫేల్ జెట్స్