ETV Bharat / bharat

ఎన్​ఐఏ చేతికి మాన్సుఖ్​ హిరెన్ మృతి కేసు

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో నిలిపివేసిన కారు యజమానిగా భావిస్తున్న​ మాన్సుఖ్​ హిరెన్​ మృతి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. థానేకు చెందిన హిరెన్ మార్చి5న అనుమానాస్పదంగా మృతి చెందారు.

MHA hands over Mansukh Hiran death case to NIA
ఎన్​ఐఏకు మాన్సుఖ్​ హిరెన్ మృతి కేసు
author img

By

Published : Mar 20, 2021, 3:29 PM IST

Updated : Mar 20, 2021, 4:02 PM IST

ముకేశ్​ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో నిలిపివేసిన కారు యజమాని​గా భావిస్తున్న మాన్సుఖ్​ హిరెన్​ మృతి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)కు కేంద్ర హోంశాఖ అప్పగించింది. ఇప్పటివరకు ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్​) దర్యాప్తు చేసింది.

ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కారు కలకలం రేపింది. ఆ తర్వాత మార్చి5న అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించారు మాన్సుఖ్​.

మరోవైపు.. తన భర్త హిరెన్​ మృతికి మహారాష్ట్ర మాజీ పోలీసు అధికారి​ సచిన్​ వాజేనే కారణమని ఆరోపించింది ఆయన భార్య. ఇప్పటికే సచిన్​ వాజేను ఎన్​ఐఏ అరెస్టు చేసి విచారిస్తోంది. ఘటనా స్థలానికి వాజేను తీసుకెళ్లి సీన్​ రీక్రియేషన్​ చేసింది.

బాంబు సామర్థ్యం తక్కువే!

కారులో దొరికిన జిలెటిన్​ స్టిక్స్​ పేలుడు సామర్థ్యం తక్కువేనని ఫోరెన్సిక్​ నిపుణులు ప్రాథమికంగా తేల్చారు. పేలితే పెద్ద నష్టం జరిగే అవకాశం చాలా తక్కువని తెలిపారు. జిలిటెన్​ స్టిక్స్​లో అమ్మెనియం నైట్రేట్​ ఉన్నట్లు తేలింది.
ఇదీ చదవండి: ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

Last Updated : Mar 20, 2021, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.