ETV Bharat / bharat

బంగాల్ హింసపై కేంద్రం నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు - బంగాల్ హింస కేంద్రం దర్యాప్తు కమిటీ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బంగాల్​లో చెలరేగిన హింసపై నిజానిజాలను తేల్చేందుకు నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. వీరిని ఆ రాష్ట్రానికి పంపింది. ఈ బృందానికి కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం వహిస్తారని వెల్లడించింది.

MHA forms four-member team to probe post poll violence in West Bengal
బంగాల్ హింసపై పరిశీలనకు కేంద్ర బృందం
author img

By

Published : May 6, 2021, 11:22 AM IST

బంగాల్​లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై కేంద్రం చర్యలకు పూనుకుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధరణ బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర హోంశాఖ.

హింస చెలరేగడానికి కారణాలను శోధించే ఈ బృందానికి హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం వహిస్తారని కేంద్రం తెలిపింది. వీరంతా బంగాల్​కు బయలుదేరారని వెల్లడించింది.

బంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. ఈ పరిణామాలపై నివేదిక పంపాలని బంగాల్‌ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అయితే సమగ్ర నివేదికను దీదీ సర్కార్ పంపించలేదని కేంద్రం తెలిపింది. నివేదిక పంపకపోతే తీవ్రంగా పరిగణిస్తామని బుధవారం హెచ్చరించింది.

ఇదీ చదవండి: 'బంగాల్ హింసాత్మక ఘటనల్లో బాలలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.