బంగాల్లో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను కోరింది కేంద్ర హోంశాఖ. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వివరణ అడిగింది.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాలని ఇటీవలే హోంశాంఖ కోరినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఓ అధికారి తెలిపారు.
బంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై దృష్టిసారించిన కేంద్రం.. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధరణ బృందాన్ని ఏర్పాటు చేసింది.
బంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు మృతి చెందారని భాజపా ఆరోపిస్తోంది. దీన్ని టీఎంసీ తిప్పికొట్టింది.