ETV Bharat / bharat

'హనుమాన్ జయంతి వేళ జాగ్రత్త'.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ - రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Hanuman Jayanti 2023 : హనుమాన్ జయంతి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కేంద్రం హోంశాఖ. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరింది.

hanuman jayanti 2023
hanuman jayanti 2023
author img

By

Published : Apr 5, 2023, 3:01 PM IST

Updated : Apr 5, 2023, 3:41 PM IST

Hanuman Jayanti 2023 : శ్రీరామ నవమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో హనుమాన్‌ జయంతి వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాసింది. శాంతి భద్రతల నిర్వహణ, హనుమాన్‌ జయంతి వేడుకలను శాంతియుతంగా జరుపుకొనేలా.. మత సామరస్యానికి విఘాతం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈనెల 6న (గురువారం) దేశవ్యాప్తంగా హనుమాన్‌ జయంతి వేడుకలను పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.

శ్రీరామ నవమి సందర్భంగా బంగాల్‌, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ లేఖలు రాసింది. గుజరాత్‌లోని వడోదరలో రెండు చోట్ల రాళ్ల దాడులు జరిగాయి. ఫతేపురలో ఎవరికీ గాయాలు కాలేదని, కుంభర్‌వాడలో ఒక మహిళ సహా కొంతమంది గాయపడినట్లు పోలీసులు చెప్పారు. బంగాల్‌లోని హావ్‌డాలో ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దుండగులు పలు వాహనాలకు నిప్పుపెట్టి.. దుకాణాలను ధ్వంసం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్​, ఎమ్మెల్యే బిమాన్ ఘోష్​ సమక్షంలోనే ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదంలో ఎమ్మెల్యే బిమాన్​కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన పోలీసులు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
బంగాల్‌లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాదాపు 1000 ఊరేగింపులను నిర్వహించాయి. ఘర్షణ తలెత్తిన సమీప ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్​ బోస్​కు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం గవర్నర్​ ఘర్షణ ప్రాంతాల్లో పర్యటించారు. మత ఘర్షణలపై పూర్తి నివేదికను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

బిహార్​లోని ససరాం, బిహార్​షరీఫ్​ పట్టణాల్లో ఘర్షణలు జరిగాయి. అనేక వాహనాలు, ఇళ్లు, దుకాణాలకు నిప్పపెట్టారు. ఈ ఘటనల్లో సుమారు 170 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గవర్నర్​ రాజేంద్ర విశ్వనాథ్​కు ఫోన్​ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అదనపు బలగాలను రాష్ట్రానికి పంపించింది కేంద్రం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రాముడి ఆలయం వద్ద జరిగిన ఘర్షణలో 10 మంది పోలీసులతో సహా 12 మంది గాయపడ్డారు. రెండు వర్గాలు ఘర్షణ పడటం వల్ల 500 మంది ఓ వర్గానికి చెందినవారు పెట్రోలు సీసాలు, రాళ్లను విసిరారు.

ఇవీ చదవండి : పట్టాలకు అడ్డుగా చెట్టు.. ఎర్రటి వస్త్రంతో ట్రైన్​ను ఆపిన వృద్ధురాలు.. వందలాది మంది సేఫ్​!

గుడిలో ముస్లిం దివ్యాంగురాలి పాఠాలు.. ఎర్రకోట సాక్షిగా పేద పిల్లలకు కానిస్టేబుల్​ విద్యాదానం​​

Last Updated : Apr 5, 2023, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.